హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Balakrishna: ఏపీ సీఎం జగన్‌పై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే..

YS Jagan-Balakrishna: ఏపీ సీఎం జగన్‌పై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే..

బాలకృష్ణ, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

బాలకృష్ణ, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Balakrishna: ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడు తెచ్చారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. మూడు రాజధానులంటూ మూడేళ్లు గడిపారని.. ల్యాండ్, శాండ్, వైన్ అన్నింటినీ వైసీపీ దోచేసిందని ధ్వజమెత్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దావోస్ వెళ్లి ఏపీ సీఎం జగన్ దిక్కులు చూశారని సెటైర్లు వేశారు. సీఎం జగన్‌కు(YS Jagan) భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ అంటూ కామెంట్ చేశారు. ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడు తెచ్చారని ఆరోపించారు. మూడు రాజధానులంటూ మూడేళ్లు గడిపారని.. ల్యాండ్, శాండ్, వైన్ అన్నింటినీ వైసీపీ (Ysrcp) దోచేసిందని ధ్వజమెత్తారు. జగన్‌కి ఒక్క అవకాశం ఇస్తే ఏం పీకుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్తి ప్రభుత్వం ఇది అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉంటున్న హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన బాలకృష్ణ.. హిందూపురం సరస్వతి విద్యా మందిర్లో కంప్యూటర్లను పిల్లలకు పంపిణీ చేశారు.

రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు వెళ్ళిపోతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ రావట్లేదని, పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలను కూడా ప్రభుత్వం వెళ్లగొడుతుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ప్రజలు కూడా ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.

రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన బాలకృష్ణ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. ఇక సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని బాలకృష్ణ అన్నారు. కానీ అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాల్సిందేనని అన్నారు.

Balakrishna-Nagarjuna: నాగార్జున ఇప్పటికైనా రియాక్ట్ అవుతారా ?.. మళ్లీ వదలని బాలకృష్ణ..

Big News: దబిడి దిబిడే..జగన్ సర్కార్ పై బాలయ్య ఫైర్

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలని ఎన్టీఆర్ అన్నారని అందుకే తాను డిగ్రీ చదువుకున్నానని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఒకవేళ సినిమాల్లో రాణించలేకపోతే ఉద్యోగమైనా చేసుకోగలను అనే ముందు చూపుతో ఆయన అలా చెప్పారని బాలకృష్ణ పేర్కొన్నారు. తనకు ఎవరైనా 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nandamuri balakrishna

ఉత్తమ కథలు