Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh politics) తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ (MLC Elections Counting) కొనసాగుతోంది. వంద శాతం పోలింగ్ జరగడంతో.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత పెరిగింది. ఒక్కో అభ్యర్థికి 22 ఓట్లు వస్తేనే గెలిచే అవకాశం ఉంది. ఆ లెక్కన వాస్తవంగా చూసుకుంటే వైసీపీ (YCP) ఏడింటికి ఏడు నెగ్గే అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ (TDP) సైతం తమ అభ్యర్థిని బరిలో నిలిపి అధికార వైసీపీకి ట్వీస్ట్ ఇచ్చింది. అంతేకాదు.. 16 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ ప్రచారం చేసింది. దీంతో ఎన్నికపై ఉత్కంఠ పెరిగింది. టీడీపీ వాస్తవ బలం 19 మంది కాదా.. 22 ఓట్లు అవసరం.. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అయిన కోటం శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ఓట్లు తమకే పడతాయన్నది టీడీపీ లెక్క.. ఈ లెక్కన 21 ఓట్లు వచ్చినట్టే.. అంటే ఇంకో ఓటు వస్తే సరిపోతుందన్నది టీడీపీ లెక్క..
అయితే టీడీపీ నుంచి దూరమయ్యి.. వైసీపీకి జై కొట్టిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకటి రెండి ఓట్లు తమకు పడతాయని టీడీపీ మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ చూస్తే.. టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు.. ఒక జనసేన ఎమ్మెల్యే ఓటు కూడా వైసీపీకే పడింది అంటున్నారు.
వైసీపీలో కొన్ని ఓట్లు క్రాస్ అవుతాయని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ వైసీపీ మాత్రం తమ ఎమ్మెల్యేలతో పార్టీ అభ్యర్థులకే ఓటు వేశారని.. ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగలేదని చెబుతోంది. ఏడుగురు అభ్యర్థుల విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికలో వందకు వంద శాతం పోలింగ్ జరగడంతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోంతుందని అంచనా వేస్తున్నారు. అవసరం అయితే మాత్రమే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు.
ప్రస్తుతం వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. టీడీపీ మాత్రం ఓ మహిళా వైసీపీ ఎమ్మెల్యే ఓటు తమకే పడింది అని చెబుతున్నాయి. ముఖ్యంగా పోలింగ్ కు ముందు టీడీపీ మాత్రం కనీసం 16 ఓట్లు క్రాస్ అవుతాయని చెబుతూ వచ్చింది. కానీ పోలింగ్ ముగిసిన తరువాత అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క క్రాస్ ఓట్ కూడా లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, TDP, Ycp