హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: గంటా రాజీనామా ఆమోదం..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రివర్స్ షాక్..!

AP Politics: గంటా రాజీనామా ఆమోదం..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రివర్స్ షాక్..!

గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫోటో)

గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫోటో)

AP Politics: టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా..? సోమవారమే రాజీనామా ఆమోదించే అవకాశం ఉందా..? ఎలాగైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నెగ్గాలని.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు తమకు పడతాయని టీడీపీ అంచనా వేస్తుంటే.. వైసీపీ రివర్స్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందా..? అసలు వైసీపీ వ్యూహం ఏంటి..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

AP Politics:  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh) రసవత్తరంగా మారాయి.. ఎన్నికలకు ఏడాదే సమయం ఉండడంతో.. ప్రధాన పార్టీలు ఇఫ్పటి నుంచే పొలిటికల్ గేమ్ (Political Game) ను మొదలెట్టాయి. మొన్నటి వరకు  వార్ లేదని.. వార్ వన్ సైడ్ అంటూ అధికార వైసీపీ లెక్కలు వేసుకుంటూ వచ్చింది. వై నాట్ 175 అంటూ ప్రతి సమావేశంలో సీఎం జగన్ (CM Jagan) చెబుతూ వస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో వారి అంచనాలు తలకిందులయ్యాయి.. జీరోగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను సైకిల్ పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే జోష్ లో.. మరో ఎమ్మెల్సీ సీటు కైవలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ (Assembly) లో వాస్తవ బలం ప్రకారం.. వైసీపీ ఏడుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చారు. బలం లేకపోయినా.. అభ్యర్థిని బరిలో దింపారు.

కేవలం అభ్యర్థిని దింపడమే కాదు.. గెలుస్తామని ధైర్యంగా చెబుతున్నారు. టీడీపీ తరపున పంచమర్తి అనురాధ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో  ఏకగ్రీవం అనువుతుంది అనుకున్న ఎమ్మెల్యే కోటీ ఎమ్మెల్సీ ఎన్నిక తప్పని సరైంది. అయితే వాస్తవ బలం చూసుకుంటే.. టీడీపీ 23 సీట్లు నెగ్గితే.. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపికి జై కొట్టారు. ఇటీవల వల్లభనేని వంశీ సైతం టీడీపీకి దూరమయ్యారు. దీంతో టీడీపీ బలం ఇప్పుడు 19కే పరిమితం అయ్యింది.

వైసీపీకి ఉన్న బలం ప్రకారం 7 నెగ్గొచ్చు.. అలాకాకుండా టీడీపీ అభ్యర్థి నెగ్గాలి అంటే కనీసం 22 ఓట్లు రావాలి.. కానీ ప్రస్తుతం టీడీపీ దగ్గర ఉన్నది 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే.. అయితే టీటీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేకు అధిష్టానం విప్ జారీ చేసింది. దీంతో వారు కచ్చితంగా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి.. లేదంటే పార్టీ నుంచి అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే యాంగిల్ లో.. టీడీపీ అభ్యర్థిని బరిలో దింపారు చంద్రబాబు.

ఇదీ చదవండి : కలంకారీ అంటే ఏంటి? ఒక్కో చీరను తాయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

ఒకవేళ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటు వేయకపోతే.. వారిపై అనర్హత వేటు వేయాలి అని స్పీకర్ ను కోరొచ్చు.. దానికి తోడు ప్రస్తుతం వైసీపీకి రెబల్ గా మారిన ఇద్దరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ  రెడ్డి తమకు ఓటేస్తారని లెక్కలు వేస్తున్నారు. అలా అయినా టీడీపీకి వచ్చేది 21 ఓట్లు మాత్రమే వస్తాయి. అంటే మరొక ఓటు కావాలి. అయితే టీడీపీ నేతలు వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు తమకు  ఓటేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనీసం వైసీపీ నుంచి మూడు నాలుగు ఓట్లు పడతాయి అని లెక్కలు వేస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్ సదుపాయం లేని గ్రామం అది.. వారిని భయపెడుతోంది ఏంటో తెలుసా?

టీడీపీ వ్యూహాన్ని ముందే పసిగట్టిన వైసీపీ అలర్ట్ అయ్యింది. మొత్తం 151 ఎమ్మెల్యేలపైనా నిఘా పెట్టింది. ఒక్కఓటు కూడా పొరపాటున చేజారకూడదని సీఎం జగన్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ట్విస్ట్ ఇచ్చేలా కూడా కనిపిస్తోంది.  ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే..? ఆ 19 కూడా పడకుండా చేస్తే సమస్యే ఉండదని అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: ఉగాది పచ్చడి ఎందుకు తినాలి..? అసలు విషయం తెలిస్తే ఎగబడి తింటారు..

గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ స్పీకర్ కు వచ్చారు. అయితే దీన్ని స్పీకర్ అమోదించలేదు. తరువాత కూడా వెంటనే రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు కూడా.. అయితే అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న.. రాజీనామాను ఇప్పుడు ఆమోదించడమే బెటర్ అని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గంటా స్పీకర్ ఫార్మట్ లోనే రాజీనామా చేశారు కాబట్టి..  ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆమోదించే అధికారం స్పీకర్ కు ఉంది. అందుకే ఇఫ్పుడు గంటా రాజీనామా లేఖను ఆమోదిస్తే.. టీడీపీ బలం 18కి తగ్గుతుందని.. వైసీపీ నుంచి రెండు మూడు ఓట్లు టీడీపీకి పడినా..?  ప్రత్యర్థి ఎమ్మెల్యే నెగ్గే అవకాశం ఉండదని వైసీపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజంగానే వైసీపీ అదే వ్యూహంతో వెళ్తుందా..? అలా చేస్తే టీడీపీ వ్యూహానికి చెక్ పెట్టినట్టే అవుతుందా..? మరి టీడీప ీఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇలా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Ycp

ఉత్తమ కథలు