P Anand Mohan, News18, Visakhapatnam
ఆయన దగ్గర ఇలాంటివి మామూలే అని కొట్టిపారేయొచ్చు. కానీ.. ఇటీవల భీమిలీ నియోజకవర్గం పద్మనాభం మండలంలో ఏకంగా మీడియాపైనే అవంతి ఎగిరారు. నీసంగతి చూస్తా అంటూ మీడియాను అన్న మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఎమ్మెల్యే.. అదీ ఒక ప్రజా సభలో ఇలా మాట్లాడటాన్ని అందరూ హవ్వా అనుకుంటున్నారు. ఈ వీడియోలోనే ఓ ఎస్సైని ఏం ఉద్యోగం చేస్తున్నావయ్యా అంటూ చిర్రుబుర్రులాడటం వైరల్ గా మారింది. ఎంత మంత్రి పదవి పోతే మాత్రం ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి నాయనా.. అంటూ ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్న పరిస్థితి నియోజకర్గంలో ఉంది.
భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజరైన అవంతి చేసిన హడావుడి ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు సిబ్బందిపైనా అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని పట్టుకుని ఏం పని చేస్తున్నావయ్యా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిని ఆయన బెదిరించారు. తర్వాత దేవుడు పైన చూస్తున్నాడని అనడం ఏదో ముక్తాయింపనే చెప్పాలి. అవంతి శ్రీనివాస్ తన హుందాతనాన్ని విడిచి.. ఇలా నెట్టింట తిట్టించుకునే దాకా పరిస్థితి వచ్చిందంటే అది ఆయన తప్పు కాదంటారు టీడీపీ పక్షాలు. మంత్రి పదవి ఇలా అమాంతం పీకేస్తే ఇలా అయిపోరేంటని ఓ ఆటాడేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Avanthi srinivas