AP POLITICS MINSTER VIDUDALA RAJANI GAVE GRAND PARTY FOR ONLY LADIES THERE IS SPECIAL GUES WHO IS SHE NGS
Vidadala Rajini: మహిళా మంత్రి గ్రాండ్ పార్టీ.. అనుకోని అతిథి రాకతో.. రాజకీయంగా ఆసక్తి
మంత్రి పార్టీకి అనుకోని అతిథి..
Vidadala Rajini: సీఎం జగన్ కేబినెట్ లో విడదల రజనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అతి యంగ్ మినిస్టర్ ఆమెనే. అంతేకాదు ఎమ్మెల్యేగా నెగ్గిన తొలి సారే మంత్రి అయ్యారు.. అది కూడా కీలక శాఖ.. ఆ వెంటనే కీలక జిల్లాకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ విజయాన్ని అందిరికీ షేర్ చేసుకోవాలనుకున్న ఆమె గ్రాండ్ పార్టీ ఇచ్చారు.. ఈ పార్టీకి అనుకోని అతిథి రావడంతో రాజకీయ చర్చకు వేదికైంది.
Vidadala Rajini: వైసీపీ (YCP)లో ఆమె ఒక సంచలనం.. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)లో ఉంటూ.. అనూహ్యంగా వైసీపీలో చేరారు. చేరిన ఏడాదే ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు.. ఎమ్మెల్యేగా నెగ్గారు.. నెగ్గింది తొలిసారే అయినా..? మంత్రిగా ఛాన్స్ దిక్కించుకున్నారు. అది కూడా కీలక శాఖ.. అక్కడితోనే ఆమె దూకుడు ఆగలేదు.. ఏపీలో కీలక జిల్లా.. కాబోయే రాజధానిగా చెప్పుకునే.. విశాఖకు ఇంఛార్జ్ మంత్రి (Visakha Incharge Minster)గా బాధ్యతలు స్వీకరించారు.. వరుస ఇన్ని ఆఫర్లు పొందిన ఆమె.. తన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.. దీంతో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది.. ఈ పార్టీకి ఊహించని అతిథి హాజరయ్యారు. ఇంతకీ ఆ అనుకోని అతిథి ఎవరు? ఆమె ఎందుకు ఇఫ్పుడు హైలెట్ అవుతున్నారు. ఆమె రాక సాధారణంగానే జరిగిందా..? లేక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా..? ఇప్పుడు గుంటూరు జిల్లా (Guntur District) రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం జిల్లాలో మంత్రి విడదల రజనీ ఇచ్చిన పార్టీ వార్తల్లో నిలుస్తోంది. అది కూడా అందరికీ పార్టీ ఇవ్వలేదు. ఓన్లీ ఫర్ లేడీస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ పార్టీ నిర్వహించారు. అదికూడా సెలెక్టెడ్ వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందిందట. అయితే పదవి వచ్చిన ఆనందంలో తోటి మహిళలకు ఓ మహిళా మంత్రి పార్టీ ఇవ్వడంలో వింత ఏమీ లేదు. ఇప్పుగు ఆ పార్టీలో కనిపించిన ఓ అనుకోని అతిథి.. రాజకీయంగా చర్చకు కారణం అయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే.. ప్రస్తుత మంత్రి రజినీ గురువు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ కావడమే ఇక్కడ విశేషం. తన భర్త ప్రత్తిపాటి పుల్లారావు (Pratipati Pullarao) ను ఓడించిన రజిని పార్టీకి.. వెంకాయమ్మ రావడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి? అందుకే ఇప్పుడంతా ఈ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. అసలు వెంకాయమ్మను పిలవాలనే ఆలోచన మంత్రి విడదల రజినీకి ఎందుకొచ్చిందనేదే? ఇప్పుడు మెయిన్ డిస్కషన్ పాయింట్.
ఇదీ చదవండి : కుప్పం = 175.. ఇదే వైసీపీ లెక్క.. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఓడిస్తే 175 నెగ్గినట్టేనా..?
అసలు విడదల రజినీ రాజకీయ అరంగేట్రం… టీడీపీ నుంచే జరిగింది. రజినీ మామ విడుదల లక్ష్మీనారాయణ అప్పట్లో చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా పనిచేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుకు రైట్ హ్యాండ్గానూ ఉండేవారు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ కొడుకు కుమారస్వామితో రజినీ వివాహమైంది. అప్పట్లో, మహానాడు వేదికపై చంద్రబాబును ఆకాశానికెత్తుతూ రజినీ చేసిన ప్రసంగం… బాగా హైలెట్టయ్యింది. టీడీపీ పెద్దల దృష్టిలోనూ పడ్డారు.
అనూహ్యంగా విడదల కుటుంబం వైసీపీలో చేరడం, చిలకలూరిపేట ఎమ్మెల్యే టిక్కెట్ రజినీకి దక్కడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటిని ఓడించిన రజినీ.. ఇప్పుడు ఏకంగా మినిస్టరయ్యారు. పార్టీమారి తనను ఓడించిన విడుదల రజినీపై ప్రత్తిపాటి కుటుంబానికి పీకల్లోతు కోపం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రజినీపైనే పోటీకి సిద్ధమవుతున్నారు పుల్లారావు. ఇలాంటి సమయంలో… మంత్రి రజినీ ఇచ్చిన పార్టీకి పుల్లారావు భార్య ఎందుకు వెళ్లారనేదే ఆసక్తి రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.