Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER ROJA VISIT TIRUMALA WITH MORE THAN 30 WALLFLOWERS DONE WITH BREAKDHARSHANAM DEVOTEES FIRE TTD NGS

Breaking News: తిరుమలలో మంత్రి రోజా తీరుపై విమర్శలు.. ఇదేం పనంటూ భక్తుల మండిపాటు

 కొండపై ప్రోటోకాల్ పాటించని రోజా

కొండపై ప్రోటోకాల్ పాటించని రోజా

Breaking News: కలియుగ దైవం తిరుమలలో మంత్రుల వ్యవహారం దుమారం రేపుతోంది. మొన్న ఉషా శ్రీ చరణ్, అంతకుముందు అప్పలరాజు.. ఇప్పుడు రోజా వ్యవహారంపై రచ్చ రచ్చ అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా 20 మందితో బ్రేక్ దర్శనాలు చేసుకోవడం దుమారం రేపుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India
    Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  మంత్రుల వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. కలియుగ దైవంగా భావించే..  తిరుమల కొండ (Tirumala Hills) పై  కొందరు మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దుమారం రేపుతోంది. ఇవాళ తన అనుచురులతో కలిసి ఆమె వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) ని దర్శించుకున్నారు. మంత్రి రోజా (Minster Roja) తో పాటు పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉంది. ఆమె వెంట 30 మంది అనుచరులు ఆలయంలోకి వెళ్లారు.. కానీ 20 మందికి అనుమతి లేదని సిబ్బంది చెప్పినా.. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరో 20 మందికి బ్రేక్ దర్శనం కల్పించారు. అంతేకాదు ఆ 20 మంది దర్శనం పూర్తైనంత వరకు.. అంటే దాదాపు 2 గంటలపైగా ఆమె అక్కడే వేచి ఉండడం ఇప్పుడు విదాస్పదమవుతోంది. భక్తుల రద్దీ మేరకు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలను సైతం ఆపేశారు. అయినా ఆ నిబంధనలను బ్రేక్ చేసి.. అందనంగా  మరో 20 మంది అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించారు రోజా.. దీంతో మంత్రి తీరుపై భక్తులు (Devotees fire on ttd) మండిపడుతున్నారు.

    ఇలా తిరుమలలో మంత్రులు వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల మరో మంత్రి ఉషా శ్రీ చరణ్ అనుచరులైతే పెను దుమారమే రేపారు. అది కూడా మంత్రి సమక్షంలోనే..  దాదాపు 50మంది అనుచరులతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. మరో పదిమంది అనుచరులు సుప్రభాతం టికెట్లను పొందారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "https://telugu.news18.com/web-stories/lifestyle/this-zodiac-signs-will-marry-their-lovers-sb-sb/index.html

    అంతకుముందు మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో దీనిపైనే వివాదం నడిచింది. అయితే ఉషా శ్రీ చరణ్ అనుచరులు.. మంత్రి ఎదురుగానే మీడియా ప్రతినిధులపై దాడి చేయడం.. భక్తులతో ఘర్షణకు దిగడం.. దుమారం రేపింది. ఆ వివాదం మరిచిపోకముందే.. ఇప్పుడు రోజా తీరు సైతం విమర్శల పాలైంది. ఆమె తీరుపై భక్తులు మండిపడుతున్నారు.

    ఇదీ చదవండి : బాలయ్య అంటే ఇది.. అభిమాని ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్.. ఏం చేశారో చూడండి

    వివాదం పక్కన పెడితే.. స్వామివారి దర్శనం పూర్తైన తరువాత మాట్లాడిన రోజా.. ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అపోజిషన్ హోదా కూడా రాదన్నారు. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు.. మంగళిగిరిలో లోకేష్ లు సైతం ఘోరంగా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. సీఎం జగన్ సుపరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం. మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ప్రజల్లో ఆదరణ పెరుగతోంది అన్నారు. పారదర్శక పాలనా సాగిస్తున్నాం కాబట్టే.. సర్వే ఏదైనా వైసీపీ దే మళ్లీ అధికారం అని చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు.

    ఇదీ చదవండి : ఘనంగా శ్రీ వెంకటేశ్వర వైభవతోత్సవాలు.. శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం.. మోహీనీ రూపంలో దర్శన భాగ్యం

    సీఎం జగన్ మన రాష్ట్రంలో ఏ పరిశ్రమ ప్రారంభించినా.. అవి మేమే తెచ్చామని తెలుగు దేశం నేతలు డబ్బాలు కొట్టుకోవడం ఆపాలన్నారు. సీఎం జగన్ చూసి కంపెనీలు పారిపోతున్నాయని మొన్నటి వరకు విమర్శలు చేసిన విపక్షాలు.. ఇప్పుడు అంతా మేమే చేశామనడం విడ్డూరంగా ఉంది అంటూ మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని గత మూడేళ్లలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనత జగన్ దే అన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Minister Roja, Tirumala, Tirumala tirupati devasthanam

    తదుపరి వార్తలు