హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabient: సీఎం చేతిని ముద్దాడి.. కాళ్లకు నమస్కారం.. ప్రమాణ స్వీకార హైలైట్స్ ఇవే

AP Cabient: సీఎం చేతిని ముద్దాడి.. కాళ్లకు నమస్కారం.. ప్రమాణ స్వీకార హైలైట్స్ ఇవే

సీఎం చేతిని ముద్దాడిన రోజా

సీఎం చేతిని ముద్దాడిన రోజా

AP New Cabinet: ఏపీ కేబినెట్ 2.0 కొలువుతీరింది. అయితే ఈ మంత్రుల ప్రమాణ స్వీకారంలో సీఎం జగన్ కు పాదాభివందనాలు హైలైట్ గా నిలిచాయి. మరోవైపు తొలిసారి మంత్రిపదవి దక్కించుకున్నో రోజా చేసిన పనికి అంతా షాక్ అయ్యారు..

Anna Raghu, Amaravathi , News18.

AP Cabinet oath:   ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త కేబినెట్ కొలువు తీరింది. మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ బిశ్వభూషణ్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్ గా ఈ కేబినెట్ కూర్పు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.. అందుకే కేబినెట్ కూర్పులో చాలా ఆచితూచి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాలనే ఆయన అధికంగా పరిగణలోకి తీసుకున్నట్టు కేబినెట్ కూర్పును చూస్తే అర్థమవుతోంది. ముందుగా నిర్ణయించిన ముహర్తం మేరకే సరిగ్గా 11.31 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. ఆల్బాబెట్ ఆర్డర్ ప్రకారం.. ఏ అక్షరం మొదలు బెట్టి ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. 25 మంది పేర్లను పరిశీలిస్తే.. అంబటి రాంబాబుతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారం.. విడుదల రజనీతో ముగిసింది. అయితే ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులే.. అంతేకాదు తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు కూడా..

ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఈ ప్రమాణ స్వీకరంలో ప్రత్యేకంగా నిలిచారు. వారిలో ముందుగా నగరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజా గురించి చెప్పాలి. ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నాప్పుడు చాలా ఉద్వేగంగా కనిపించారు. తన చిరకాల కోరిక తీరింది అనే ఆనందం ఆమెలో స్పష్టంగా కనిపించింది. అందుకే తనకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ తాను ఎప్పటికీ మరిచిపోలేను అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే.. సీఎం జగన్ పాదాలను నమస్కరించారు. వద్దని వారించినా రోజా ఆగలేదు. అంతటితో ఆగకుండా ఆయన చేతిని ముద్దాడు.. ఆ తరువాత కాసేపు ఇద్దను నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు..మరోవైపు ఈ ప్రమాణ స్వీకరంలో ఎక్కువ మంది మంత్రులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా..ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్.. అనంతపురం జిల్లాకు చెందిన ఉష శ్రీచరణ్.. చిత్తూరు జిల్లాలకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేసారు. అయితే ఎక్కువమంది విధులుగా ముద్ర పడ్డ కొత్త మంత్రుల్లో ఎక్కువ మంది సీఎం జగన్కు పాదాభివందనం చేశారు. అందులో గుడివాడ అమర్నాద్.. ముత్యాలనాయుడు.. జోగి రమేష్.. ఉషశ్రీ చరణ్.. మేరుగ నాగార్జున.. రాజన్న దొర.. విడదల రజని, ఆర్కే రోజా ఉన్నారు. వీరంతా తొలి సారి ప్రమాణ స్వీకారం చేసినవారే.

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Rk roja