Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు పై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అయితే మరింత దూకుడు ఉంది.. ఓ వైపు ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా జనం బాట పట్టారు. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaki Government) అంటూ ప్రజల్లోనే ఉంటున్నారు.. తాజాగా సీఎం జగన్ (CM Jagan) మరికొన్నేళ్లు సీఎంగా ఉండాలని కోరుతూ.. పాదయాత్ర చేపట్టారు వైసీపీ (YCP) నేతలు.. ఈ సందర్భంగా మంత్రి రోజా (Minister Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి, మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకుకు పాదయాత్రగా వచ్చారు. కన్నుమూసిన ప్రసాద్ రెడ్డి ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు.
తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర శ్రీశైలం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. 30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలన్నదే వారి ఆంకాంక్ష అని చెబుతున్నారు. ఇక చిర్ల జగ్గిరెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురు మూర్తి పాల్గొన్నారు.
ఈ పాదయాత్రను ప్రారంభించిన మంత్రి రోజా , డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అలిపిరి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అనుకోని విధంగా పాదయాత్ర తిరుమలకు చేరుకుని అకాల మరణం పొందడం బాధాకరం అన్నారు.. వారి కల నెరవెరలని శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగించాలని విప్ జగ్గిరెడ్డి అన్నకొనసాగిస్తున్నారు వారికి అభినందనలు తెలిపుతున్నాను అన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు.. కాపులు కొత్త పేట నియోజక వర్గంలో కొండత అండగా నిలుస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకు పాదయాత్రగా వచ్చారన్నారు. ఆయన ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపడుతున్నాం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Minister Roja