Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER ROJA HUSBAND RK SELVAMANI DEMAND TAMIL HEROES SHOOTING THEIR MOVIES IN TAMILANADU ONLY NGS

RK Selvamani: మంత్రి రోజా భర్త సంచలన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు వద్దని సూచన

ఆర్ కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు

ఆర్ కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు

RK Selvamani: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోనే సినిమా షూటింగ్ లు జరగాలని కోరుకుంటోంది. ఇతర భాషా సినిమాలు సైతం ఇక్కడ షూటింగ్ లు జరుపుకునే అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో మంత్రి రోజా భర్త.. ఆర్ కె సెల్వమని.. సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు రాష్టాల్లో సినిమా షూటింగ్ వద్దంటూ సలహా ఇస్తున్నారు. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి ...
    RK Selvamani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP)లో రోజా కూడా ముఖ్యమైన నేత.. అందులో్నూ ఆమె మంత్రి కూడా. ప్రభుత్వ పరమైన కార్యక్రమాలైనా.. పార్టీ పరమైన కార్యక్రమాలైనా..  మంత్రి రోజా (Minster Roja) కుటుంబ సభ్యులు అంతా చాలా సందర్భాల్లో హాజరు అవుతూ ఉంటారు. ఇక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టిన.. భర్త సెల్వమణి (RK Selvamani)తో కలిసి రోజా పాల్గొంటుంటారు. కాబట్టి రోజా కుటుంబానికి సంబంధించిన ఏ వార్త అయినా.. అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటు రోజా, అటు సెల్వమణి ఇద్దరిదీ సినీ నేపథ్యం.. సినిమాల గురించి పూర్తి అవగాహన ఉన్న దిగ్గజాలు వారు ఇద్దరు.. కాబట్టి ఆ రంగాలకు సంబంధించి చేసే వ్యాఖ్యలపై ఆచూతూచి వ్యవహరించకపోతే ఆ ప్రభావం వేరేలా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. సినిమా షూటింగ్ (Movie Shooting) లో ఎక్కువగా రాష్ట్రంలోనే జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఇటీవల సినిమా రేట్లు పెంపు విషయంలోనూ సీఎం జగన్ (CM Jagan) స్వయంగా ఓ కండిషన్ పెట్టారు. 20 శాతానికి పైగా షూటింగ్ లో ఏపీలో జరుపుకుంటేనే.. రాయితీలు ఇస్తామని ప్రకటించారు కూడా.. అయితే ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇతర భాషల సినిమా షూటింగ్ లు సైతం ఏపీలో జరిగితే.. గుర్తింపుతో పాటు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రి భర్త ఆర్ కె సెల్వమణి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

    ఇటీవల రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం మొదలెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ సినిమా పెద్దల.. ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు జరగకుండా చూడాలంటూ ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమా షూటింగ్ లో హైదరాబాద్ లో జరుగుతుండడంతో.. అక్కడి సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి : సిక్స్ కొట్టి.. విల్లు ఎక్కి పెట్టి.. నా ఆట చూడు అంటున్న మంత్రి రోజా..

    తమిళ అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని ఆయన అంటున్నారు. అందుకే ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు. కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి అన్నది ఆయన ఆవేదన.

    ఇదీ చదవండి : ఈ ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది? వరుస అత్యాచార ఘటనలతో పోలీసుల అలర్ట్.. కీలక నిర్ణయం

    ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణి కి తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు పెట్టుకోవడం నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?..అంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఓ తమిళ సినిమా డైరెక్టర్ గా ఈ వ్యాఖ్యలు చేస్తే ఎవరూ పట్టించుకునే వారు కాదు.. కానీ ఆయన భార్య ప్రస్తుతం ఏపీలో ఉంటున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత.. అంతేకాదు ఆమె మంత్రి కూడా ఇలాంటి సమయంలో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం కానీ.. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Rk roja, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు