Minster Roja: తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Government) పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (సీఎన్‌ఓఎస్) (CNOS) ఓ సర్వే నిర్వహించింది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంది. ఆ సంస్థ చేసిన తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని మోదీ (Prime Minster) కి గతంలో కంటే ప్రజాదరణ కాస్త పెరిగింది. ఇక ముఖ్యమంత్రుల పనితీరులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik) అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండో స్థానంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ (Yogi Adithya Nath) నిలిచారు. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంల విషయానికి వస్తే ఆ సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది తెలంగాణ ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు సర్వే వివరించింది. ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఈ జాబితాలో చివరి నుంచి ఆరోస్థానంలో నిలిచారు. 25 మంది సీఎంల పనితీరుపై సర్వే నిర్వహించగా జగన్‌కు 20వ ర్యాంక్ దక్కింది. సీఎం జగన్ పనితీరుపై 39 శాతం మంది ఏపీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 32 శాతం మంది తటస్థంగా ఉన్నారు. అయితే ఈ సర్వే ఇప్పుడు ఏపీలో ప్రకంపణలు రేపుతోంది.
ఈ సర్వేపై మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minster Perni Nani) విమర్శలు చేశారు. ఏపీలో జగన్ గ్రాఫ్ తగ్గిందనడం విచిత్రంగా ఉందన్నారు. అట్టడుగుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ని కాపాడుకోడానికి టీడీపీ (TDP) చేయించిన సర్వే ఇది అని ఆరోపించారు. ఆ సర్వే చేసిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదే అని.. వాళ్లు ఇలా కాక ఎలా రిపోర్టు ఇస్తారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ద్వారా టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూశారని.. అది కుదరలేదని తెలిపారు. తండ్రీ కొడుకుల వల్ల టీడీపీ గ్రాఫ్ లేవడం లేదన్నారు. అందుకే ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనంద పడిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సీఎన్‌వోఎస్ ర్యాంకుల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రజలకు జగన్ అంటే కంపరం పుట్టిందని.. అందుకే 20వ స్థానంలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా సర్వే చేస్తే టీడీపీ వాళ్లు చేయించారని అంటారా.. వైసీపీకి వ్యతిరేకంగా ఏం వచ్చినా వాళ్లంతా టీడీపీ వాళ్లు చేయించినట్టేనా అని ప్రశ్నించారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని వేరేవరో చెప్పడం దేనికీ.. వాళ్లకే రిపోర్టులు వాళ్ల దగ్గరే ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి : వీడు మామూలోడు కాదు.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా ఒకరితో పెళ్లి.. 11మందితో కాపురం
చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే.. ఒకవేళ చంద్రబాబుకు చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు రోజా.. ఉదయం తిరుమలలో వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఆమె.. తరువాత మీడియాతో మాట్లాడుతూ.. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం విషయంలో చంద్రబాబు మానసిక స్థితి అర్థమవుతోంది అన్నారు. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శమన్నారు.
ఇదీ చదవండి : ఆ నేతలందరినీ బోనెక్కిస్తాం.. ఇదే వైసీపీకి లాస్ట్ ఛాన్స్ అంటున్న చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మాటలు విన్న తరువాత ప్రజలంతా చీదరించుకుంటున్నారని రోజా అభిప్రాయపడ్డారు. వైసీపి ప్లీనరీని చూసిన తరువాత ఎవరైనా ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం ఏ పార్టికి ఉంది అనేది అర్ధం అవుతుందని, ప్రజలంతా స్వచ్చందంగా వచ్చి వైసీపి ప్లీనరీలో ఏపి సీఎంను ఆశీర్వాదించారన్నారు.. సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఆరోవ స్ధానం వచ్చిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Minister Roja