Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER ROJA GIVES SHOCK TO HER OPPONENTS IN HER OWN YSRCP IN NAGARI CONSTITUENCY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Minister Roja: ప్రత్యర్థుల ప్లాన్ కు రోజా చెక్.. స్కెచ్ మాములుగా లేదుగా..!

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

రాజకీయంగా ఎప్పుడు రగడ కలిగిన ప్రాంతంగా నగరి (Nagari) కి గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో నగరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకు ప్రధాన కారణం పర్యాటక శాఖా మంత్రి రోజా (Minister Roja). ఇందుకు మరో కారణం రోజాకున్న ప్రత్యర్థి వర్గం.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  రాజకీయంగా ఎప్పుడు రగడ కలిగిన ప్రాంతంగా నగరి (Nagari) కి గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో నగరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకు ప్రధాన కారణం పర్యాటక శాఖా మంత్రి రోజా (Minister Roja). ఇందుకు మరో కారణం రోజాకున్న ప్రత్యర్థి వర్గం. సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే ఆజ్ఞ లేనిదే ఎలాంటి పని అయినా ముందుకు సాగదు. కానీ నగరిలో చాల డిఫెరెంట్.. రోజాకు తెలియకుండానే ఎన్నో పనులు అలా అలా సాగిపోతున్నాయట. మూడేళ్ళ నుంచి రోజా నియోజకవర్గంలో ఇదే పంచాయితీ. మంత్రి కానంత వరకు ఇబ్బంది పడ్డారు. మంత్ర అయిన తర్వాత ఆ ఇబ్బందులకు చెక్ పెట్టాలని రోజా బావించారేమో..! ప్రత్యర్థులకు చెక్ పెట్టె దండాన్ని ప్రయోగించారట.

  2019 ఎన్నికల నాటి నుంచి వ్యతిరేక వర్గం రోజాపై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. మూడేళ్ళ పాటు నగరిలో ఎన్నో అవమానాలు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రోజా. మంత్రి అయ్యాక అన్ని సర్దుకుంటాయని భావించారు. మంత్రి పీఠం కైవసం చేసుకున్న రోజాకు సందర్భం ఏది అయినా ప్రత్యర్థి వర్గం నుంచి పోరు మాత్రం తప్పడం లేదు. రోజా ఒక్క ఎత్తు వేస్తే అసమ్మతి వర్గంపై ఎత్తు వేస్తూ ఆమెను కంగారులోకి నెట్టేస్తున్నారట. రోజాకు తెలియకుండా నియోజకవర్గంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వైరి వర్గం నేతలు.

  ఇది చదవండి: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఈఏపీసెట్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..


  నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలో కొత్తగా ఐదు క్వారీలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలుపెట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లిన అంశం మంత్రి రోజాకు ఏమాత్రం తెలియాదట. రోజా అసమ్మతి వర్గీయులు జిల్లాకు చెందిన మరో మంత్రి సాయంతో కార్యక్రమాన్ని ముందుకు నడిపినట్లు సమాచారం‌. విషయం రోజాకు తెలియగానే అధికారులపై ఫైర్ అయ్యారట. ఇప్పటి వరకు రోజా మాత్రమే అసమ్మతి వర్గంపై బాహాటంగా చెప్పేవారు. ఈసారి రోజా వర్గీయులు రోడ్డెక్కి మరీ ప్రత్యేర్థులపై తమ అసమ్మతిని వెల్లగక్కే ప్రయత్నం చేసారు. ఓపెన్‌గానే వ్యతిరేకవర్గం చర్యలను ప్రశ్నించడంతో రోజా టాప్ గేర్ లో వెళ్తున్నారనేది ఆమె యాంటీ బ్యాచ్ అంచనా.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిట్టా ఇదే..!


  కొత్త క్వారీల ప్రతిపాదనకుషాడోలా నగరి వైపీపీలో రోజా వ్యతిరేక వర్గమైన కేజే కుమార్‌ ఉన్నారట. ఈసలాపురం గ్రామ లెక్కల్లో ఇప్పటికే ఉన్న నాలుగు క్వారీలపై కాలుష్యం వెదజల్లుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడే మరో ఐదు క్వారీలకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనలు రావడంతో రోజా శిబిరం అప్రమత్తం అయ్యింది. అదే జరిగితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని వార్నింగ్‌ ఇస్తున్నారు రోజా ముఖ్య అనుచరుల్లో ఒకరైన పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్‌ ఆనంగి హరి. ఇతర కౌన్సిలర్లు, గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా.. మైన్స్‌ అండ్ జియాలజీ.. పర్యావరణ శాఖల అధికారులు క్వారీ భూముల్లో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి రోజా మండిపడ్డారట.  జిల్లా మరో మంత్రి అండతోనే కేజే కుమార్‌ అండ్ కో క్వారీలు పొందే ప్రయత్నంలో ఉన్నట్టు రోజా వర్గీయుల వాదన. వచ్చే ఎన్నికల్లో రోజా వ్యతిరేకవర్గం తమలో ఎవరికో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని.. కలసికట్టుగా విజయానికి కృషి చేస్తామని చెబుతోంది. ఇప్పుడు క్వారీలు వారికి చేతికి వస్తే ఆర్థికంగా మరింత బలపడతారని.. అంతిమంగా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని రోజా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అందుకే ఆమె వర్గం స్వరం పెంచిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో రెండువర్గాల మధ్య నలిగిపోతున్నామని వాపోతున్నారు అధికారులు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Minister Roja, Ysrcp

  తదుపరి వార్తలు