Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలులఅ జనంలోకి వెళ్తున్నాయి. విపక్షాలతో పోలిస్తే అధికార పార్టీ మరింత దూకుడుగా ఉంది. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో జనం బాట పట్టారు మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు.. అది కూడా స్వయంగా తమ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని మరి ప్రజల్లోకి వెళ్తున్నారు. పథకాలు అందరికీ అందుతున్నాయా..? అందకపోతే ఎందుకు అందడం లేదు..? సీఎం సక్షేమ పాలన ఎలా ఉంది. సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తగ్గించొచ్చని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరనే కారణంతో వ్యతిరేకత ఉందనే నివేదికలు సీఎం జగన్ (CM Jagan) దగ్గర ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులను ప్రజలకు దగ్గర చేశారు జగన్. ఇక త్వరలోనే మంత్రులంతా సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల ప్రజలను నేరుగా కలవనున్నారు. వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో వివరించనున్నారు. అలాగే ఇంకా వారు ఏం కోరుకుంటున్నారు అన్నదానిపైనా ఆరా తీయనున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పొరపాట్లు సరిదిద్దుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పట్టారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఆయన ఎండగడుతున్నారు. పన్నులు, ఛార్జీలు అన్ని పెంచేసిన ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. అలాగే ఈ నెల చివరిలో జరిగే మహానాడు తరువాత మరింత దూకుడుగా ప్రజల దగ్గరకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తన్నారు చంద్రబాబు నాయుడు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం.. కౌలు రైతులకు నగదు అందిస్తూ.. గ్రామాల బాటపట్టారు. ఇలా కీలక నేతంలా ప్రజల చుట్టూ తిరుగుతుండడంతో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.
ఇదీ చదవండి : ఏపీలో పరిస్థితులపై మొన్న తెలంగాణ మంత్రులు.. నేడు చిన జీయర్ స్వామి విమర్శలు
ఇదే సమయంలో మంత్రి రోజా (Minster Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్విట్ చంద్రబాబు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు..
ఇదీ చదవండి : వల్లభనేని వంశీ ఫ్యూచర్ పై క్లారిటీ వస్తుందా.. నేడు సీఎం దగ్గర గన్నవరం పంచాయితీ
కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు చాలా హస్యాస్పదంగా ఉన్నాయి అన్నారు. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని ఆమె కోరారు. 14 సంవత్సారాలు సీఎంగా వున్నా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్‌గా కూడా చేయలేని అసమర్థుడు అంటూ ఫైర్ అయ్యారు. కానీ సీఎం జగన్ కు ప్రాంతాలపై విబేధం లేదని.. ఆయన సొంత నియోజకవర్గంతో పాటు.. అన్ని ప్రాంతాలను డవెలప్ చేస్తున్నారని రోజా వెల్లడించారు. అందుకే తాము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతుంటే.. వాళ్లు మీడియా ముందు డ్యాన్సులు వేస్తున్నారు అంటూ మండిపడ్డారు రోజా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Pawan kalyan, Ycp