Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER ROJA COMMENTS ON PAWAN KALYAN AND ATAMKUR BY POL NELLORE DISTRICT NGS

Minter Roja: పవన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు.. ఆయన పోరాటం పొత్తుల కోసమే..

పవన్ పై మంత్రి రోజా సెటైర్లు

పవన్ పై మంత్రి రోజా సెటైర్లు

Minter Roja: ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం చంద్రబాబునే టార్గెట్ చేసినా.. అధికార వైసీపీ.. ఇప్పుడు ఎక్కువగా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి పవన్ వర్సెస్ ప్రభుత్వం అన్న రేంజ్ లో మాటల తూటాలు పేలుతున్నాయి.

ఇంకా చదవండి ...
    Minter Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా కీలక నేతలంతా జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అధికార పార్టీ ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) నిర్వహిస్తోంది. మరోవైపు మంత్రులు బస్సు యాత్ర  (Minster Bus Yatra) చేశారు.. త్వరలోనే సీఎం జగన్ (CM Jagan) సైతం జనాల్లోకి వచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒకటి రెండు నెలల తరువాత నుంచి ఆ పార్టీ కీలక నేతలు అంతా ప్రజలకు చేరువ అయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం సైతం జనం బాట పట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో జిల్లాల యాత్ర చేపట్టారు.. ఈ యాత్రను అన్ని జిల్లాల్లో కొనసాగించే నిర్ణయం చేస్తున్నారు. త్వరలోనే బస్సు యాత్ర కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. నారా లోకేష్ (Nara Lokesh) సైతం.. సుధీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇక జనసేన (Janasean) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సైతం కౌలు రైతులకు సాయం పేరుతో గ్రామాల బాపడుతున్నారు.

    ఇలా అన్ని పార్టీలు ఓ వైపు జనం జపం చేస్తున్నాయి. వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోనే ఉంటూ.. అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.. మరోవైపు విమర్శలు, ప్రతి విమర్శలతో పరిస్థితి హీటెక్కిస్తున్నారు.. మీరు ఒకటేంటే మేం రెండు అంటాం అనే రేంజ్ లో మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మొదట ఆత్మకూరు ఉప ఎన్నికపై స్పందిచిన ఆమె.. ఈజీగా విజయం సాధిస్తామని.. అది కూడా భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

    ప్రస్తుతం జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పేరు ప్రకటించాలని జనసైనికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలకు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ.. బీజేపీ పోటీకి సిద్ధమైంది. దీంతో బీజేపీ, జనసనే పొత్తుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఇదీ చదవండి : ఆరోగ్యశ్రీ పథకం జగన్ ది కాదు..? కేంద్రాన్ని కాపీ కొట్టారు.. సీఎం అభ్యర్థిపై క్లారిటీ..?

    ప్రభుత్వ సంక్షేమ.. పథకాలు.. గౌతమ్ రెడ్డి చేసిన అభివృద్ధిపై ఓట్లు అడుగుతామని ఆమె వెల్లడించారు. బీజేపీ పోటీ నామమాత్రమే అన్న రోజా.. పవన్ కల్యాణ్‌కు మూడు ఆప్షన్లు లేవు.. ఓకే ఆప్షన్.. ఓడిపోవడమే అంటూ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయారని, టీడీపీకి ఇంకా 50 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పాడని, ఇలాంటి పార్టీలు ఎలా వైసీపీకి పోటీ ఇస్తాయంటూ ఆమె న సెటైర్లు వేశారు. ఇక పవన్ కళ్యాణ్ పోరాటం.. అరాటం అంతా పొత్తుల కోసమే అన్నారు.. సీఎం అభ్యర్థి సంగతి అలా పక్కన పెడితే.. ఆయన సింగిల్ సీటులోనైనా గెలవగలరా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాల నుంచి పోటీ చేసే దమ్ము కూడా పవన్ కు లేదని రోజా విమర్శించారు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు