Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER RK ROJA SLAMS ON EX CM CHANDRABBAU NAIDU WHY HIS PARTY LOSS IN ASSEMBLY ELECTIONS NGS

Minster Roja: చంద్రబాబు ఓడిపోవడానికి కారణం అదే.. టీడీపీ తీరుపై మంత్రి రోజా ఫైర్

చంద్రబాబుపై రోజా ఫైర్

చంద్రబాబుపై రోజా ఫైర్

Minster Roja: గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్ట ఘోరంగా ఓడింది. అధికార పార్టీగా ఎన్నికల బరిలో దిగి.. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అయితే ఆ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని టీడీపీ నేతలే చెబుతుంటారు. తాజాగా అసలు చంద్రబాబు ఓటమికి కారణం ఇదే అంటూ మంత్రి రోజా వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సరికొత్త వ్యూహాలతో దూకుడుగా వెళ్తున్నాయి. అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) .. ఇప్పటికే జిల్లాల టూర్ కు సిద్ధమయ్యారు.. తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చే.. సిక్కోలు నుంచే పర్యటనను మొదలు పెడుతున్నారు.. బాదుడే బాదుడు పేరుతో.. ఏపీ ప్రభుత్వం (AP Government) వ్యతిరేక విధానాలను ఎండగట్టే పనిలో పడ్డారు. అది కూడా స్పీకర్ ఇలాకాలో.. సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఏపీ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అందులో భాగంగానే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబుపై మంత్రి రోజా (Minster Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.

  మాజీ సీఎం చంద్రబాబు హయాంలో చెల్లించాల్సిన 1800 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించకుండా బకాయి పెట్టి వెళ్లిపోయారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు విడ్డూరంగా బాదుడే - బాదుడు అనడంతో ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు తన హయాంలో వ్యాట్.. విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అని రోజా ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తే.. జగన్ దానిని ప్రభుత్వం లో విలీనం చేసారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పై చిత్త శుద్ధి ఉంది కాబట్టి.. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించటమే కాకుండా.. ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నామన్నారు.

  ఇదీ చదవండి : పిట్ట కొంచెం కూత ఘనం.. ఐదేళ్లకే ఊహించని సాహసం.. మెగా పవర్ స్టారే స్ఫూర్తి

  సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రంగాలను ప్రత్యేకంగా చూస్తున్నారని.. అందులో భాగంగా.. విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలంతా.. నారకాసుర ఆంధ్రప్రదేశ్ గా భావించారని.. అందుకే ఆయన్ను గద్దె దింపారని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలపైన ప్రభుత్వం సీరియస్ వ్యవహరిస్తోందన్నారు. అలాగే కఠిన శిక్ష విధిస్తోందని చెప్పుకొచ్చారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గాయని మంత్రి రోజా వివరించారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని రోజా మండిపడ్డారు.

  ఇదీ చదవండి : : ఈయన గోల్డ్ హే.. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బాబు బంగారం.. అమ్మ మాటే ఇలా మార్చేసిందా?

  కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘటన సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ నెల అయిదో తేదీన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారని.. తాను మంత్రి అయిన తరువాత తొలిసారి సీఎం తమ జిల్లాకు రావటం పైన రోజా హర్షం వ్యక్తం చేసారు. 5వ తేదీన తిరుపతిలో సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లును మంత్రులు పెద్దిరెడ్డి.. రోజా.. స్థానిక ఎమ్మెల్యే భూమనతో కలిసి పరిశీలించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Minister Roja, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు