Minister Roja: ఏపీ మంత్రి రోజా (AP Minster Roja) మునిపటి ఫాంలోకి వచ్చేశారు. ఫైర్ బ్రాండ్ ముద్రను కొనసాగిస్తున్నారు. ఆ మధ్య మంత్రి పదవి లేదన ఆవేదన, సొంత పార్టీ నుంచి గ్రూపులతో కాస్త సైలెంట్ గా కనిపించిన ఆమె.. మంత్రి పదవి వచ్చాక.. మళ్లీ పైర్ ను బయటకు తీస్తున్నారు. రోజా అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి (Tirumala Tirupati) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) ని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న తెలుగు దేశం (Telugu Desam) తో పాటు ఇతర పార్టీలకు ఇది చెప్పుదెబ్బ లాంటిదన్నారు రోజా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తేనే చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారని, కానీ తమ ప్రభుత్వంలో వరుసగా రెండుసార్లు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ లో ర్యాంకింగ్ రావడం జగనన్నను ఎలా పొగడాలో కొంతమందికి అర్థం కావడం లేదన్నారు.
ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మాని హైదరాబాద్ ఇంట్లో కూర్చోవాలని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కేవలం ప్రచార ఆర్భాటంతప్పితే జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు. అయితే రెండు రోజుల ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలపై ఆమ మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సింహంతో వేట.. జగన్ అన్నతో ఆట వద్దంటూ బాలయ్య డైలాగ్ లు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల బాక్సులు బద్దలవ్వడం ఖాయమంటూ వార్నింగ్ ఇచ్చారు..
రోజా విమర్శలు ఎలా ఉన్నా.. సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- ఈవోడీబీ)లో ఏపీ ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచి గత ర్యాంకింగ్ ను ఏపీ ప్రభుత్వం కాపాడుకుంది. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాలపై స్టే
బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ ప్లేస్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎచీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించగా.. అందులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రం లెక్కల ప్రకారం ఏపీ 97.89 శాతం స్కోర్ సాధించగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరత్ రాష్ట్రం రెండో స్థానాన్ని సాధించింది. తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించింది. టాప్ అచివర్స్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు చోటు సంపాదించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Tirupati