Perni Nani on Pawan Kalyan: మంత్రి పేర్ని (Minster perni Nani) నాని.. ఇక మాజీ అవుతున్నారు. ఆయనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ (Pawan kalyan), చంద్రబాబు (Chandrababu)లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ తీరును తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. పవన్ లా తాను మాటలు మారుస్తూ ఉంటే.. తనను అందరూ చెప్పులతో కొట్టేవారేమో అని అభిప్రాయపడ్డారు.. పవన్ పార్టీ పెట్టేముందు చంద్రబాబును కలిశాను అని చెప్పారని.. అయినా ఎవరైనా పార్టీని పెట్టాలనుకుంటే ఎన్నికల కమిషనర్ ను కలవాలి కానీ.. చంద్రబాబును కలవడం ఏంటి అన్నారు. ఇక 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పల్లకీ మోసిన ఆయన.. తరువాత చంద్రబాబు, లోకేష్ (Lokesh) ను తిట్టిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ (BJP)ని ఎన్ని మాటలు అన్నారని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అంటూ కామెంట్లు చేసిన పవన్.. ఇప్పుడు బీజేపీ చంక ఎక్కారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రస్తుతం ప్రేమిస్తూ.. చంద్రబాబుకు పవన్ కన్ను కొడుతున్నారంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.
నిలకడ లేని రాజకీయ నేత పవన్ అంటూ కామెంట్ చేశారు పేర్ని నాని.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు అన్నారు. 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టుల తో జత కట్టి.. చిన్నప్పటి నుంచి తనకు కంకికొడవలి అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారని.. 2019 ఎన్నికల్లో ఓడిన వెంటనే బీజేపీతో జత కట్టారని విమర్శించారు. అంతకముందు బీజేపీని బండబూతులు తిట్టిన ఆయన.. తరువాత అదే బీజేపీతో ఎలా జతకట్టారని ప్రశ్నించారు.
పవన్ హాబీగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదన్నారు. ఆయన మాటలు చూస్తే అవకాశ రాజకీయాలు చేస్తున్నారని ఎవరైనా చెప్పొచ్చు అన్నారు. పవన్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. పవన్ మాటలకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డా ఉంటారా అని ప్రశ్నించారు. పవన్‌లా మాట మార్చితే ప్రజలు మండిపడతారని.. ఒకప్పుడు చెగువేరా ఫోటోలు పెట్టుకున్న పవన్ ఇప్పుడు చంద్రబాబు ఫోటోలు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం. 2014లో పవన్ ఎవరి పల్లకీ మోశాడు అని నాని మండిపడ్డారు.
ఇదీ చదవండి : మూకుమ్మడి రాజీనామాలు చేసిన మంత్రులు.. సీఎం జగన్ వారికి ఏం చెప్పారంటే..?
మంత్రి పదవి నుంచి తప్పించడంపైనా క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తమ సామర్ధ్యాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామన్నారని, ఇప్పుడున్న వారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఉండవచ్చని.. ఎవరికి ఏ బాధ్యత ఇస్తారన్నది సీఎం చెప్పలేదన్నారు.
ఇదీ చదవండి : కొత్త జిల్లాలకు కొత్త కోడ్ లు.. వాటి ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు
తనకు ఇప్పుడున్న మంత్రుల, ఎమ్మెల్యే సామర్థ్యం తెలుసని.. వారి సామర్థ్యాన్ని బట్టి కొందరికి మంత్రి బాధ్యతలు, కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని నాని అన్నారు. అలాగే కేబినెట్ భేటీలో.. ఎనిమిది మండలాలతో పులివెందుల, ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు. పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా 12 ఉద్యోగాలకు ఆమెదం.. ఏపీ మిల్లెట్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం. తొగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌కు 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్‌పోస్టులు మంజూరు. దర్శి డిగ్రీ కాలేజ్‌లో 34 టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి : రంధ్రంలో రాజ రాజ చోర.. ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కున్నాడు
ఏపీలో కరెంట్ కోతలపైనా పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు లాంతర్లు పట్టుకుని తిరిగేవారి పుణ్యమే అన్నారు. గత ప్రభుత్వం అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేసి 22 వేల కోట్ల రూపాయల అప్పు భారం పెట్టి పారిపోయిందని విమర్శించారు. ఇప్పుడేమో ఆ పార్టీ పెద్ద మనుషులు లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారన్నారు. పాత బకాయిలు తీర్చేవరకు కొత్త కరెంట్ కొనేందుకు వీల్లేదని ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా తాము కరెంట్ కొనేందుకు సిద్ధంగా ఉన్నా మార్కెట్లో దొరకట్లేదన్నారు. మూడేళ్లలో 22వేల కోట్లు తీర్చడం ఆషామాషీ వ్యవహారం కాదని పేర్ని నాని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Pawan kalyan