AP POLITICS MINSTER PEDDIREDDY RAMACHANDRAREDDY SLAMS TDP CHIEF CHANDRABABU ON FALSE ALLEGATIONS ON SAND POLICY IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
AP Politics: ఇల్లుకట్టినా.. బంగారం పంచినా.. కుప్పం ఫలితం అదే..! పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మైనింగ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) తిప్పికొట్టారు. టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టినా, బంగారు నాణేలు పంచినా గెలిచేది మాత్రం వైసీపీనేనని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మైనింగ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) తిప్పికొట్టారు. టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టినా, బంగారు నాణేలు పంచినా గెలిచేది మాత్రం వైసీపీనేనని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇసుకపై రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకొచ్చిందని.., ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించి కొందరు మంత్రులతో కమీటీ వేసి లోపాలను సరిదిద్దిందన్నారు. ప్రస్తుతం టెండర్ల విధానం ద్వారా ఇసుక విధానం మార్పులు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో అధికారులపై దాడులు చేసిన పట్టించుకోలేదని, చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని రోపించారు. అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టీడీపీ ప్రబుత్వానికి ఏకంగా రూ.100 ఫైన్ వేసిందని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి ఏడాదికి రూ.750 కోట్లు ఇసుక ద్వారా ఆదాయం సమకూర్చుతున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. ఎం.ఎస్.టి.సి సంస్థ ద్వారా ఇసుక దక్కించుకునే అవకాశం కల్పించాంమని ఆయన తెలిపారు. ఈ.ఎం.డి కింద రూ.120 కోట్లు కాషన్ డిపాజిట్ ఏర్పాటు చేశాంమని, ఎలాంటి అవకతవకలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1450 ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు అక్రమ ఇసుకకు సంబంధించి 1400 వాహనాలు సీజ్ చేసినట్లు వివరించారు. అరాగే 485 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇసుకకు సంబంధించి లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తుందన్నారు పెద్దిరెడ్డి. ఎస్.ఈ.బి పూర్తి స్థాయిలో ఇసుక అక్రమాలను నియంత్రిస్తుందన్నారు. రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.., మొదట పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 28వేలు మంది రైతులకు మీటర్లు బిగించివనట్లు తెలిపారు. వీటిలో 33.15 శాతం అదనంగా సేవింగ్ చేస్తున్నామని ఆయన వివరించారు. ఏడాదికి పది వేల కోట్లు రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి రైతుల పేరుతో ఎకౌంట్లు తెరిచి నగదు చెల్లిస్తాంమన్న మంత్రి.. పూర్తి సబ్సిడీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన నగదును ప్రభుత్వమే వారి ఖాతాల్లో వేయడం, వారు డిస్కమ్ లకు చెల్లించడం వల్ల విద్యుత్ సరఫరా పట్ల వారికి అవగాహన పెరుగుతుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్ధుడు కాబట్టి కుప్పంకు నీళ్ళు కూడా తీసుకుని పోలేక పోయారన్నారని మండిపడ్డారు. 35ఏళ్ల తరువాత కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడంపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. చంద్రబాబు కుప్పంలో ఇల్లుకట్టుకున్నా, ఓటర్లకు బంగారం పంచినా గెలుపు మాత్రం వైసీపేదనని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.