AP POLITICS MINSTER KODALI NANI GAVE CLARITY WHY HE REMOVED FROM JAGAN SECONG CABINET THIS THE EQUATIONS NGS
Kodali Nani: మంత్రి పదవి నుంచి ఎందుకు పక్కన పెట్టారంటే..? ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని క్లారిటీ
కొడాలి నాని (ఫైల్)
Kodali Nani: గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కొడాలి నాని కీలక వ్యాఖ్యలతో మళ్లీ ముందుకు వచ్చారు. మంత్రి పదవి నుంచి తనను సీఎం జగన్ ఎందుకు తప్పించాల్సి వచ్చింది అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెర దించారు.
Kodali Nani: కొడాలి నాని (Kodali Nani)ని ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పించారు..? ఆ సామాజిక వర్గం పై కోపంతో దూరం పెట్టారా..? లేక ఆ సామాజిక వర్గ ఓట్లు ఎలాగూ పడవని ఫిక్ప్ అయ్యారా..? లేదా మంత్రిగా కొడాలి ఫెయిల్ అయ్యారా..? కాదంటే ఆయన నోటి దురుసే మంత్రి పదవి కొనసాగింపు లేకుండా చేసిందా..? జిల్లా, రాజకీయ, సామాజిక సమీకరణలు సహకరించలేదా.. గత కొన్ని రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతోంది. కొడాలి నానిని తప్పించడానికి అదే కారణం అంటూ ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. అయితే దీనిపై కొడాలి నానే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ (CM Jagan) తనను సొంత మనిషిలా చూసుకుంటున్నారని.. అందుకే మంత్రి పదవి నుంచి తప్పించినా ఎలాంటి నష్టం ఉండదని.. పార్టీకి తన సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే మంత్రి వర్గంలో కొనసాగింపు దక్కలేదు అన్నారు. అధినేత సూచనలతో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తాను అన్నారు. కేవలం గుడివాడ (Gudivada) పైనే ఫోకస్ చేయకుండా.. రాష్ట్రా వ్యాప్తంగా ఫోకస్ చేస్తాను అన్నారు. సీఎం ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను ఓ సైనికుడిలా నెరవేస్తాను అన్నారు.
ఇంకా సీఎం జగన్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో కూడా వివరించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు కొడాలినాలి. అయితే గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత పనిచేయాలని సూచించారన్నారు. గ్రాఫ్ పెంచుకోకపోతే… వారిని పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదన్నారు. విభేదాలను విడిచి అందరూ కలసి పనిచేయాలని ఆదేశించారని చెప్పారు.
అలాగే జనసేన అధినేత పవన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జెండా, ఎజెండా వేరు అని ఆరోపించారు. కోడిగుడ్డుపై ఈకలు పీకడమే పవన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎట్టి పరిస్ధితుల్లో అధికారంలోకి రాడు అంటూ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలిందని.. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందన్నారు.. కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 50 నుంచి 40 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారని వెల్లడించారు కొడాలి నాని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.