హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minster vs Ex Minster: సీఎంను కలిసిన తరువాత సంచలన వ్యాఖ్యలు.. మంత్రి పదవి ముఖ్యం కాదన్న కాకాణి

Minster vs Ex Minster: సీఎంను కలిసిన తరువాత సంచలన వ్యాఖ్యలు.. మంత్రి పదవి ముఖ్యం కాదన్న కాకాణి

మాజీ వర్సెస్ తాజా మంత్రి

మాజీ వర్సెస్ తాజా మంత్రి

CM Serious on Nellore Leaders: మంత్రి వర్సెస్ మాజీ మత్రి వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందా..? నెల్లూరు జిల్లా వైసీపీ వర్గ పోరుకు అధినేత చెక్ పెట్టినట్టేనా..? సీఎం భేటీ తరువాత మంత్రి వ్యాఖ్యలకు అర్థం ఏంటి..? మాజీ మంత్రితో కలిసి నడవడం సాధ్యమయ్యే పనేనా..?

ఇంకా చదవండి ...

CM Serious on Nellore Leaders: నెల్లూరు (Nellore) వైసీపీ (YCP)లో వర్గ పోరుపై సీఎం జగన్ (CM Jagan) సీరియస్ అయ్యారు. అలానే వదిలస్తే.. పార్టీకి తీవ్ర నష్టం తప్పదని భావించారు. అందుకే వెంటనే అప్రమత్తమయ్యారు. ఇద్దరు నేతలు క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి క్లాస్ పీకినట్టు సమాచారం. ఇద్దరు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణాలు ఎదుర్కోవలసి వస్తుందని.. సీనియర్ నేతలే ఇలా చేస్తే.. మిగిలిన వారి పరిస్తితి ఏంటి అని ప్రశ్నించినట్టు సమాచారం.. ఇద్దరు పోటీ పడితే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించినట్టు టాక్.. నిజంగా ఒకరితో ఒకరికి సమస్య ఉంటే తనతో వచ్చి చెబితే సరిదిద్దుతానని.. ఇలా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు వైసీపీ వర్గాల టాక్.. సీఎం జగన్ తో భేటీ తరువాత మంత్రి కాకని (Minster Kakani) బయటకు వస్తే.. మరోసారి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav). ఆ తరువాత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాటకపోవడం.. అసలు ఇద్దరి మొహాల్లో చిరునవ్వు లేకపోవడంతో వివాదం సద్దు మణిగేలా లేదని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.. అధినేత మాట కాదనలేక తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పినా.. వచ్చే ఎన్నికల నాటికి కలిసి పనిచేస్తారా అన్నది అనుమానే అంటున్నారు.

సీఎం జగన్ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. అనిల్ కు తనకు మధ్య ఎక్కడా విభేదాలు లేవన్నారు. తాము ఎక్కడా పోటా పోటీ సభలు నిర్వహించలేదన్నారు. పోటా పోటీ సభలనేవి మీడియా సృష్టే అని కొట్టిపారేశారు. సాధారణంగా నిప్పులేనిదే పొగరాదు అంటారు కానీ.. ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తోంది అన్నారు. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉందన్నారు. నీడనిచ్చే చెట్టు నీడను నరుక్కునే మూర్ఖులం తాము కాదన్నారు. జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా అంతా పని చేస్తామన్నారు. తనకు అనిల్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. నెల్లూరులో ఎవరి ఫ్లెక్సీలు ఎవరూ చింపలేదని.. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని మాత్రంమే సీఎం సూచించారన్నారు కాకాణి..

ఇదీ చదవండి: ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టుకోండి.. ఎవ్వరినీ వదిలేది లేదు.. పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్

కేవలం పార్టీ అభివృద్ది, సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడామని.. ఇతర అంశాలు చర్చకు రాలేదన్నారు. అందరం కలసి సీఎంతో కలసి మాట్లాడామన్నారు. తనను సొంత వ్యక్తిగా అనిల్ భావించి ఉండొచ్చు.. అందుకే నాకు కృతఙతలు తెలపలేదని భావిస్తున్నా అన్నారు. తనను ప్రమాణ స్వీకారానికి పిలవలేదని అనిల్ ఏ నేపథ్యంలో అన్నారో..? తెలీదని.. అసలు నేను అనిల్‌ కుమార్‌ ని పిలిచానా..? లేదా..? అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదని టాపిక్ మార్చేశారు.. ఇలా ఆయన వ్యాఖ్యలు చూస్తే వివాదం సద్దుమణగలేదనే అనుమానాలు కలగడం సహజం..


ఇదీ చదవండి: టీడీపీలోకి భారీగా వలసలు..! పక్కా సమాచారంతోనే ఆ మాజీ మంత్రి కామెంట్ చేశారా..?

మరోవైపు సీఎం జగన్‌తో సమావేశానికి ముందు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు కొంతమంది అనేక ప్రయత్నాలు చేశారన్నారు. పనికట్టుకుని తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు. మంత్రి పదవి తనకు ముఖ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm jagan, Nellore, Ycp