AP POLITICS MINSTER BOTSA SATYANARAYANA SENSATIONAL COMMENTS ON KONASEEMA FIRE INCIDENT NGS VZM
Botsa: కోనసీమ హింసకు వారే కారణం..? బస్సు యాత్రలో క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
మంత్రి బొత్స సత్యానారాయణ
Botsa on Chandrababu and Pawan: కొనసీమలో హింసాత్మక ఘటనలకు కారణం ఎవరు..? మంత్రుల బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసే.. విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయా..? మంత్రి బొత్స ఏమన్నారంటే..?
Botsa on Chandrababu and Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం రణరంగాన్ని పరిస్థితి తలపిస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ల తో రాజకీయం హీటెక్కింది. దానికి ఇప్పుడు కోనసీమ జిల్లా (Konaseema District) వివాదం తోడైంది. నిత్యం ప్రశాంతంగా ఉండే కోనసీమలో హింసాత్మక ఘటనపై అధికార విపక్షాలు తప్పు మీదంటే మీది అని విమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ పరిపాలనా వైఫల్యానికి కోనసీమ ఘటన ఒక ఉదహరణ అని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు.. ఎమ్మెల్యే అరెస్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడం.. ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలు చర్చించుకోకూడదనే ఉద్దేశంతోనే.. ఇలా హింసాత్మక ఘటనలకు ప్రభుత్వమే పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా వారి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana). ఆ నాయకులు చేసిన కామెంట్స్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బొత్స.. ప్రధాన ప్రతిపక్ష నేత దివాలాకోరు రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎవరైనా..? తమ మంత్రి, ఎమ్మెల్యేలపై తామే దాడి చేసుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబులా మామ ఇంటిపై రాళ్లు వేయించి, అల్లర్లు సృష్టించిన చరిత్ర తమది కాదన్నారు.
కోనసీమ పేరుతో అమలాపురంలో అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని, దానిని వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి బొత్స హెచ్చరించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదని విమర్శించారు. తుని ఘటనపై చేసిన వ్యాఖ్యలుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. అంబేద్కర్ పేరు పెట్టాలని కోనసీమలో ప్రతిపక్షాలు కోరలేదా? అని ప్రశ్నించారు మంత్రి. తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని, బాధ్యులకు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణలకు మతిభ్రమించిదని విమర్శించారు. మంత్రుల బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు 30 రోజుల గడువు పెట్టడం చట్టప్రకారం ఉన్న పద్ధతి. పవన్ కల్యాణ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. ఇలాంటి అంశాల్లో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడటం మాని.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా? వద్దా? అన్నది స్పష్టం చేయాలన్నారు. కోనసీమ విధ్వంసానికి కారణమైన 70 మందిని గుర్తించామని.. ఇప్పటికే అరెస్టు చేశామన్నారు.
ప్రస్తుతం పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారని. దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలో బయటకు వస్తుందని బొత్స అభిప్రాయపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను చంద్రబాబు కుల వృత్తులకే పరిమితం చేశారని.. కానీ వారిని జగన్ ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు బొత్స అభిప్రాయపడ్డారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.