హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CPS: సీపీఎస్ మీద క్లారిటీ ఇచ్చేసిన మంత్రి బొత్స.. ఓపీఎస్ అమలు కష్టమని స్పష్టం.. మరి ఉద్యోగులు ఏమంటున్నారు..?

CPS: సీపీఎస్ మీద క్లారిటీ ఇచ్చేసిన మంత్రి బొత్స.. ఓపీఎస్ అమలు కష్టమని స్పష్టం.. మరి ఉద్యోగులు ఏమంటున్నారు..?

బొత్స సత్యనారాయణ

బొత్స సత్యనారాయణ

CPS: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చేసిందా..? ఎన్నికలకు రెండేళ్లు కూడా సమయం లేకపోవడంతో విషయాన్ని ఇంకా నాన్చడం సరైంది కాదని ఫిక్స్ అయ్యిందా.. అందుకే తాజా కేబినెట్ భేటీ తరువాత మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు. సీపీఎస్, ఓపీఎస్ రెండింటిపైనా క్లారిటీ ఇచ్చారు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Minster Botsa Satyanarayana on CPS: ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh) లో ప్రభుత్వం (Government) వర్సెస్.. ఉద్యోగుల వివాదం మరింత ముదురుతుందా? లేక ఉద్యోగులను కూల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఎందుకంటే ఎన్నికలకు ముందు వైసీపీ (YCP) ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు (CPS Cancel ) చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు (Employees Union) డిమాండ్ నుంచి వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే.. అయితే అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు బొత్స..

ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని.. సీపీఎస్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే.. సీపీఎస్ కంటే మెరుగైన విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని బొత్స మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు తనతో తన ఇంట్లో జరిగిన సమావేశాలు అనధికారికమేనని.. ఇవాళ జరిగిన సమావేశం మాత్రం.. అధికారమైందన్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్‌ల గురించి ఊహాజనితంగా ఎవరూ మాట్లాడవద్దని బొత్స కోరారు. ఉద్యోగులకు సీపీఎస్ కంటే మంచి స్కీం ఇస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. తాము 95 శాతం మానిఫెస్టోలో అంశాలు నెరవేర్చామని.. మిగిలి పోయిన 5 శాతం అంశాల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి అని పేర్కొన్నారు. ఓపీఎస్ అమలు కుదరదని అనేకసార్లు చెప్పేశామన్నారు.

ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ కానుకలు ఇవ్వొద్దని టీటీడీ సూచన.. ఎందుకో తెలుసా?

ఎందుకంటే ఓపీఎస్‌తో ఎన్నో ఆర్ధిక అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. దానికన్నా మంచి స్కీం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బొత్స అన్నారు. ఓపీఎఫ్ సాధ్యం కాదని ముందే చెప్పామన్నారు. ఓపీఎఫ్ తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దానికన్నా మంచి స్కీమ్ కోసం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం.. తమకు సీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. కానీ సీపీఎస్ కంటే జీపీఎస్ బెస్ట్ అని ఏపీ సర్కార్ అంటోంది.

ఇదీ చదవండి : ఏపీలో ఈ విగ్రహాలకు ఫుల్ డిమాండ్.. ఇంట్లో ఉంటే డబ్బే డబ్బే.. విగ్రహాలకు ఆ ఊరు ఫేమస్

దీంతో ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యామానికే వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 11వ తేదీన సీఎం ఇంటి ముట్టడితో తమ ఉద్యమ తీవ్రత ప్రభుత్వానికి తెలియచేయాలని భావిస్తున్నారు. సీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అన్నదే తమ నినాదమని.. దాని నుంచి వెనక్కు తగ్గేదే లే అంటున్నారు ఉద్యోగులు.. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Botsa satyanarayana, Ycp

ఉత్తమ కథలు