Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. ఏపీలో రూపాయికే కిలో బియ్యం (Kilo Rice) అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై (PMGKY) పథకం పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రవేశ పెట్టిన పథకానికి 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందని గుర్తు చేశారు. తాము మాత్రం కోటి 50 లక్షల మందికి.. అదనంగా బియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కోరనా (Corona) వైపరీత్యం సమయంలోనే ఆ బియ్యాన్ని ప్రకటించిందని.. అయితే ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుండి పునరాలోచన చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేకూరుస్తోంది ఏపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించామని.. కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందుకే రాయలసీమ (Rayalaseema), ఉత్తరాంధ్ర (Uttarandhra), ప్రకాశం జిల్లా (Prakasam District) ల్లో వారికి అందిస్తామన్నారు. విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupati) నగరాలకు మినహాయించి ప్రకాశం జిల్లాకు అందిస్తున్నామన్నారు.
ఏపీవ్యాప్తంగా కోటి 67 లక్షల మందికి కేంద్రం ఇచ్చిన బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని, మిగిలిన జిల్లాల్లోని ఎస్సి, ఎస్టీ వర్గాలకు కూడా 89 లక్షల 20 వేల మందికి ఇస్తామన్నారు. ఏఏవై కార్డులున్న వారికి కూడా ఆ బియ్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్గు ఒకటవ తేదీ నుంచి ఈ బియ్యం అందిస్తామన్నారు. అలాగే ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే రేషన్ ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రేషన్ డోర్ డెలివరీ విధానంలో రెగ్యులర్‌గా ఇస్తున్నామని.. అయితే కేంద్రం ఇచ్చేది రేషన్ షాప్ లకు వెళ్లి తీసుకోవాలన్నారు. తాము ఇంటింటికి ఇచ్చే బియ్యం సోర్టెక్స్ బియ్యమని, కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం నాన్ సోర్టెక్స్ బియ్యమని ఆయన పేర్కొన్నారు. కారణం ఏదైనా కొన్ని నెలల తరువాత ఏపీలో.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కార్డులు ఉన్న పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కానుంది.
ఇదీ చదవండి : ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?
అయితే ఏపీ నుంచి బియ్యం, ధాన్యం సేకరణను నిలిపివేయాల్సి వస్తుందంటూ కేంద్రం చేసిన హెచ్చరికతోనే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుందని బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 88,76,255మంది ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ కార్డుదారులు మాత్రమే ఉచిత బియ్యం పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 56,66,437 మంది రేషన్‌కార్డుదారులకు ఈసారి ఉచిత బియ్యం లేనట్టే. పీఎంజీకేఏవై కార్డుదారులకు అవసరమైన ఉచిత బియ్యాన్ని కేంద్రం కేటాయిస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎ్‌సఏ పరిధిలో లేని కార్డుదారులకు ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత ఐదు విడతలుగా కార్డుదారులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని సరఫరా చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Botsa satyanarayana, Central governmennt