Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER BOTSA SATYANARAYAN CHALLENGED TO TDP CHIEF CHANDRABABU NAIDU ON GOVERNMENT SCHOOLS ISSUE NGS GNT

Botsa Satyanarayana: ఒక్క ప్రభుత్వ స్కూల్ మూయలేదు.. నిరూపించాలి అంటూ చంద్రబాబుకు బొత్స సవాల్

మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఆయనకు ఛాలెంజ్ కూడా విసిరారు.

    Botsa Satyanarayana: తెలుదేశం పార్టీ (Telugu Desam Party) త్వరలోనే ఖాళీ అవుతోంది అన్నారు మంత్రి బొత్స సత్యాన్నారయణ (Botsa Satyanarayana). అలాగే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పని కూడా అయిపోయింది అన్నారు. వైసీపీ నిర్వహించే ప్లీనరీలో ప్రతిపక్ష నేతలా నోటికొచ్చినట్లు మాట్లాడమంటూ బొత్స పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరిగే వైసీపీ ప్లీనరీ (YCP Plenary) సమావేశాల ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. మంగళగిరి (Mangalagiri) నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 లక్షలకు పైగా వస్తారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ప్లీనరీని అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మొన్నటి ప్రతిపక్ష పార్టీ నిర్వహించిన మహానాడు (Mahanadu) సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ప్లీనరీ అంతకంటే హిట్ అవ్వకపోతే.. అది పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్లీనరీని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన బొత్స.. ఈ మూడేళ్ళలో ప్రభుత్వ ప్రగతిని ప్లీనరీ ద్వారా వివరిస్తామని తెలిపారు. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ ప్లీనరీలో చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమమని.. ఇంటికొకరు జైలుకు వెళ్లడం కాదు.. ఇంటికొకరు చంద్రబాబు కు ఓటు వేస్తారా..? అంటూ విమర్శించారు.

    ఈ మూడేళ్లలో ఏం చేశామో చెప్పడంతో పాటు.. రానున్న రెండేళ్లు ఏం చేయబోతుంది.. కూడా స్పష్టత ఇస్తామన్నారు. అలాగే వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలి..? అనే అంశాలపై వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ నాయకులతో చర్చించనున్నారు. ఈ ప్లీనరీలో మొత్తం 9 తీర్మానాలను చర్చించి ఆమోదం తెలపనున్నట్లు నాయకులు తెలిపారు. ఇప్పటికే ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను పార్టీ పెద్దలు సిద్ధం చేశారు.



    అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు బొత్స.. రాష్ట్రంలో
    ఒక్క స్కూల్‌ కూడా మూసివేయ లేదన్నారు. ఆ ప్రసక్తే లేదని.. ప్రభుత్వ పరంగా, ఒక మంత్రిగా అధికారికంగా చెబుతున్నాను అన్నారు. 8 వేల స్కూళ్లు ఎక్కడ మాయమయ్యాయో చూపించండి.. మాయం అవ్వడానికి అవేమైనా తోపుడు, ఎడ్ల బండ్లా? ఏమిటా భాష? ఏమిటా రాతలు? ఎందుకంత అనైతికత? అంటూ సూటిగా ప్రశ్నించారు..

    ఇదీ చదవండి : చంద్రబాబు ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం అదా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత

    రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,750 స్కూళ్లు. 5250 స్కూళ్ల మ్యాపింగ్‌ చేశామన్నారు. వాటిలో కిలోమీటర్‌ కంటే ఎక్కువ దూరంలో 296 ఉన్నాయన్నారు. వాటిపైనా సమీక్షిస్తున్నామన్నారు. అవసరమైతే వాటినీ మారుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు ఆధారాలు చూపించాలి అంటూ సవాల్ విసిరారు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Chandrababu Naidu, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు