AP Cabinet: గత కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది.. అందరి ఊహాగానాలకు తెరదించుతూ.. పాత కొత్త కలయికలో 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వారికి శాఖలు కూడా కేటాయించారు. తాజా కేబినెట్ (AP New Cabinet) లెక్కలు చూస్తూ.. టార్గెట్ 2024 అని రాజకీయ విశ్లేషకుల మాట.. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ఈ కేబినెట్ విస్తరణలో ఆ సీనియర్ మంత్రి వర్గానికి సీఎం జగన్ (CM Jagan) పెద్ద పీట వేశారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు.. ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా చెప్పుకునే బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana).. మొన్నటి వరకు ఆయనను మంత్రిగా కొనసాగించరని.. రాజ్యసభకు పంపించి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెడతారని ప్రచారం జరిగింది. అంతేకాదు ఒకప్పుడు మొత్తం ఉత్తరాంధ్రను శాసించిన ఆయనకు సొంత జిల్లాలోనే మాట చెల్లుబడి అవ్వడం లేదని.. ఉత్తరాంధ్రకు చెందిన ఆ మంత్రి కేవలం డమ్మీ అని.. అంతా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కనుచూపుల్లోనే వ్యవహారం నడుస్తోందని ప్రచారం ఉంది. స్థానిక ఎన్నికల్లో సీట్లు.. కాంట్రాక్ట్ లు.. నామినేటెడ్ పదవులు.. ఇలా ఏ విషయంలో ఆయన మాట చెల్లుబడి కాలేదంటూ వార్తలు వినిపించాయి. ఆ ప్రచారాలు అన్నిటికీ ఎండ్ కార్డు వేస్తూ.. ఈ సారి కేబినెట్ విస్తరణలో ఆయన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్..
అంతలో ఇంత మార్పుకు కారణం ఏంటి..? ముఖ్యంగా తొలి సారి కేబినెట్ కూర్పులో జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి లాంటి వారు తమ వంతు పాత్ర పోషించారు. రెండో కేబినెట్ లో అసలు వారిని సంప్రదించిన సందర్భం కూడా కనిపించలేదు.. వారి సిఫార్సులు కూడా కనీసం లేవు. ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన సాయిరెడ్డి పూర్తిగా మౌనం పాటించాల్సి వచ్చిందని వైసీపీ వర్గాల టాక్.. మొన్నటి వరకు విజయసాయి వ్యూహాలతో మౌనంగా ఉన్న బొత్స కు ఇప్పుడు ప్రయారిటీ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చగామారింది.
ఇదీ చదవండి : నిమ్మకాయ కంటే యాపిల్ బెటరా..? కన్నీరు పెడుతున్న టమాటో రైతులు.. ఎందుకో తెలుసా..?
ఈ కేబినెట్ కూర్పును ముందు బొత్సాకు సైతం సెకెండ్ ఛాన్స్ లేదంటే ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన్ను రాజ్యసభకు పంపించి.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం పెడతారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా సీనియారిటీ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు సీఎం జగన్.. ఆ కోటాలో బొత్సకు సెకెండ్ ఛాన్స్ ఇచ్చారు జగన్.. ఆయనకు ఛాన్స్ ఇవ్వడమే కాదు.. తాజాగా కేబినెట్ లో ఆయన వర్గానికి పెద్దపీట వేశారు. బొత్స కు అత్యంత సన్నిహితంగా ఉండే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వణితలకు మంత్రి పదవులు దక్కటం ద్వారా.. సామాజిక సమీకరణాలే కారణమని చెబుతున్నా..బొత్సా టీంకు ప్రయార్టీ దక్కిందనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి : కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి..? ఆయన మాటలకు అర్థం అదేనా..?
బొత్స వర్గానికి ప్రయారిటీ ఇవ్వడానికి ప్రధాన కారణం.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదికే అని తెలుస్తోంది. ఆ మధ్య క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించిన ప్రశాంత్ కిషోర్ టీం.. ప్రస్తుత ఎమ్మెల్యేల పని తీరు..? ఎవరితో పార్టీకి ఎంత లాభం.. ఎమ్మెల్యేలను గెలిపించగలిగే సత్తా ఉన్న నేతలు ఎవరు..? అనే అంశాల ఆధారంగానే రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. అందులో భాగంగా బొత్సాకు బాధ్యతలు ఇస్తే.. ఉత్తరాంధ్రలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం పక్కా అనే నివేదిక ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇందులో భాగంగానే ఆయనకు అంత ప్రాధాన్యం ఇచ్చారని పొలిటికల్ వర్గాల టాక్...
ఇదీ చదవండి : రాజీనామాకు కారణం అదే.. మాజీ హోం మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
దీనికి తోడు చివరి కేబినెట్ సమావేశంలో మంత్రులంతా మూకుమ్మడి రాజీనామాలు చేసిన వెంటనే.. బొత్స సత్యానారాయణ ఛాంబర్ లో కొందరు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బొత్సతో పాటు తాజా మాజీ మంత్రి అవంతి, రెండో ఛాన్స్ దక్కించుకున్న తానేటి వనితతో పాటు మరో ఇద్దరు ముగ్గురు సమావేశమైనట్టు ప్రచారం ఉంది. అయితే తిరిగి మంత్రులుగా కొనసాగించకుండా.. భవిష్యత్తు ఏంటి అన్నదానిపైనే వీరు చర్చించుకున్నారనే ప్రచారం కూడా ఉంది. బొత్స వర్గం ఏదైనా పార్టీకి వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే.. ఉత్తరాంధ్రపై ఆ ప్రభావం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కారనాలన్నింటినీ లెక్కేసుకున్న తరువాత సీఎం జగన్.. ఆయన వర్గానికి పెద్ద పీట వేశారనే ప్రచారం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Botsa satyanarayana