హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Ambati: పవన్ నాలుగో పెళ్లి లోపు.. పోలవరం పూర్తి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Minister Ambati: పవన్ నాలుగో పెళ్లి లోపు.. పోలవరం పూర్తి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

pawan kalyan(file)

pawan kalyan(file)

Amabati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రుల కౌంటర్ ఎటాక్ కొనసాగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ నాలుగో పెళ్లి జరిగే లోపు.. పోలవరం పూర్తి చేయడం తన బాధ్యత అంటై కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Minister Ambati Rambabu on Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల యుద్ధం అప్పుడే మొదలైంది. పార్టీల మధ్య మాటల తూటాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యల దూమారం ఆగడం లేదు.. ఆ వార్ పీక్ చేరుతోంది. విశాఖ (Visakha) ఘటన తరువాత.. ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తన చెప్పు చూపించి.. ఇకపై ప్యాకేజ్ స్టార్ అన్న కొడుకలకు అందరినీ చెప్పుతో కొడాతాను అన్నారు.  వైసీపీ లో ఉన్న కాపు సన్నాసులకు ఈడ్చి కొడతాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి.. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 మందితో తిరుగుతున్న మీకేంటి నష్టం అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) ని కలిసి.. అధికార వైసీపీపై యుద్ధానికి సిద్ధమంటూ సీరియస్  గా హెచ్చరికలు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అప్పటి నుంచి వైసీపీ కౌంటర్లు కొనసాగుతూనే  ఉన్నాయి. మంత్రులంతా లైన్ గా పవన్ పై మాటల ఎదురుదాడి ప్రారంభించారు. ఇక మంత్రి అంబటి అయితే సోషల్ మీడియాలో వార్ చేస్తున్నారు. తాజాగా పవన్ పై సచంలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అన్నారు.. సిద్ధం అన్నారు.. అడ్రస్ లేకుండా పారిపోయారు అంటూ ఓ ట్వీట్ చేశారు.

అక్కడితోనే అంబటి ఆగలేదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది.. కనీసం అరగంట అయినా ప్రెస్ ముందుకు వచ్చి అంబటి చెప్పగలరా అంటూ జనేసేన చేసిన విమర్శలకు అదే స్థాయిలో అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ నాలుగో పెళ్లి అయ్యేలోపు పోలవరం పూర్తి చేసే బాధ్యత తనది అంటూ సెటైర్లు వేశారు.

కేవలం మంత్రులు మాత్రమే కాదు.. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనం మూడు రాజధానులు కావాలని కోరుకుంటు.. కొందరు నేతలు.. మూడు పెళ్లిళ్లు చేసుకొంది. భార్యలను వదిలేయండూ అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులు మనకు ఉండడం దౌర్భాగ్యం అన్నారు. ఇలాంటి నాయకులా దిశా నిర్దేశం చేసేవారు అంటూ మండిపడ్డారు.

First published:

Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Pawan kalyan, Polavaram

ఉత్తమ కథలు