Home /News /andhra-pradesh /

AP POLITICS MINSTER AMBATI RAMBABU CONFIDENCE ON NEXT ELECTION WIN FOR YCP WHAT HE SAID NGS GNT

Ambati Rambabu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఎన్ని..? సీఎం అయ్యేది ఎవరు..? అంబటి రాంబాబు ఏమన్నారంటే..?

చంద్రబాబు, అంబటి రాంబాబు (ఫైల్)

చంద్రబాబు, అంబటి రాంబాబు (ఫైల్)

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటమిలపై చర్చించుకుంటున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీడీపీ తమకు 160 సీట్లు వస్తాయని చెబుతోంది. అధికార వైసీపీ కూడా మరింత నమ్మకంగా చెబుతోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
    Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)రాజకీయాల్లో ఎక్కడ చూసినా వచ్చ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అందరి నోట ఇదే చర్చ.. అయితే దీనిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వార్ వన్ సైడ అని ధీమాగా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రత్యర్థి పార్టీల కంటే దూకుడుగా వెళ్తోంది. వైసీపీ (YCP) స్పీడ్ చూసిన వారంతా ముందస్తు ఎన్నికల ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్లీనరీ సమావేశాలతో బిజీ అయ్యింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల గురించే చర్చ సాగుతోంది. విపక్షాలపై విరచుకుపడుతూ వైసీపీ నేతలు ప్లీనరీలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయవాడ (Vijayawada)లో సెంట్రల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు.. ప్రజల కోసం అడగకుండానే సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ (C M Jagan) కి దక్కుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు (Minster Ambati Rambabu). ఏపీలో పేదల విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు మల్లాది విష్ణు.

    కరోనా సమయంలో జగన్ లాంటి సీఎం లేకపోతే పరిస్థితి దారుణంగా వుండేదని. విజయవాడ సెంట్రల్ లో కరోనా సమయంలో అనేక సేవలు అందించామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2024 లో వైసీపీకి కంచుకోటగా సెంట్రల్ నియోజకవర్గం వుంటుందన్నారు. ఏ రాజకీయ పార్టీకి నవరత్నాలతో పోటీపడే ఛాన్స్ లేదన్నారు ప్లీనరీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మంత్రి అంబటి రాంబాబు, హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్, మేయర్, డిప్యూటీ మేయర్. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంతో పాటు.. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అన్నారు.

    వంగవీటి రాధా వచ్చిన ఎవరు వచ్చిన విజయవాడ సెంట్రల్ లో వైసీదే విజయం అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అలాగే పవన్ ఊడిగం చేస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీకే సొంతం అవుతాయని.. మళ్లీ సీఎం గా జగన్ ఎన్నిక అవుతారని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించటానికి గడప గడపకి వెళ్తున్నాం. టిడిపి కి, పవన్ కళ్యాణ్ కు ఓటు వేసిన వారి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు వివరిస్తున్నాము అన్నారు. అసలు గ్లాసు కు ఓటు వేసిన తనకు కాపు నేస్తం వచ్చింది అని లబ్ధి దారులు చెబుతున్నారని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు.

    ఇదీ చదవండి : ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా..? ఇంత ఈజీ అని చెబుతున్న మల్లెల సాహితి..

    వచ్చే ఎన్నికల్లో జగన్ ను సింగిల్ గా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. అయ్యన్న పాత్రునికి నోరు విప్పితే బూతులే అని. ఎన్ని జన్మలెత్తిన చంద్రబాబు సీఎం కాలేడన్నారు. చంద్రబాబు కు జై కొట్టే వాళ్ళు ఇద్దరే… లోకేష్, అతని దత్త పుత్రుడు పవన్ అని అంబటి రాంబాబు ఎద్దేవ చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో వస్తవో ఎవరితో వస్తావో.. రా…. కట్టకట్టి కృష్ణ నదిలో కలిపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు