హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Minster: పవన్‌-అమర్‌నాథ్‌ ల ఫొటో వైరల్.. మంత్రి ఇమేజ్ చూసి పవన్ ఫోటో కోసం వెంటపడ్డారా? ఏం సెప్తిరి.?

AP Minster: పవన్‌-అమర్‌నాథ్‌ ల ఫొటో వైరల్.. మంత్రి ఇమేజ్ చూసి పవన్ ఫోటో కోసం వెంటపడ్డారా? ఏం సెప్తిరి.?

పవన్ తో ఏపీ మంత్రి ఫోటో.. అమర్ నాథ్ క్లారిటీ

పవన్ తో ఏపీ మంత్రి ఫోటో.. అమర్ నాథ్ క్లారిటీ

Minister Amarnath: సోషల్ మీడియాలో ప్రస్తుతం జనసేనాని పవన్ -మంత్రి అమర్ నాథ్ ఫోటో వైరల్ అవుతోంది. పవన్ పై దారుణమైన విమర్శలు చేస్తున్న అమరనాథ్ ఈ ఫోటోకు అర్థం చెప్పాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..? అయితే దీనికి తనదైన స్టైల్లో సమాధానం ఇస్తున్నారు మంత్రి.. తన ఇమేజ్ చూసి పవన్ ఇలా ఫోటో దిగారమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  inister Amarnath: మాజీ మంత్రి పేర్ని నాని  (Ex Minster Perni Nani)రోల్ ను.. తాజా మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amar Nath) తీసుకున్నారా.? మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగతం ఏదీ వదలడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. నిత్యం ఏదో సందర్భంతో పవన్ పై విమర్శలు చేస్తునే ఉన్నారు. ఒక్క రోజు కూడా ఆ విమర్శలకు బ్రేక్ ఇవ్వడం లేదు. కేవలం పవన్ ను టార్గెట్ చేయడానికే మంత్రి పదవి ఇచ్చారా అనే రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కు చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడు అనే టైటిల్ ఇచ్చి.. ఆ పేరుతో తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు. అంతేకాదు ఆయన విలువలు లేని.. ముగ్గురు పెళ్లాల ముద్దుడు మొగుడు అంటూ మండిపడ్డారు.. అక్కడితో ఆయన ఆగడం లేదు.. రోజు ఏదో ఒక టాపిక్ తీసి పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో జనసైనికులు (Janasea Fans) సైతం కౌంటర్లు ఇస్తున్నారు.. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  గతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. పవన్ పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్‌నాథ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే మంత్రి.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు దిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. తనపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవ్వడంపై స్పందించారు మంత్రి.. మిగిలిన వాళ్లలాగా పవన్ కల్యాణ్‌ ఎవరో తెలియదని తాను అనడం లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తనకు ఇచ్చిన ఇమేజ్ కారణంగా.. తనతో చాలామంది ఫోటోలు దిగుతున్నారని.. మరి పవన్ కూడా అదే విధంగా ఫోటో దిగారేమో అని సెటైర్లు వేశారు.

  దానికి వెంటనే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు పవన్ అభిమానులు.. గతంలో పవన్ వైజాగ్ వచ్చినప్పుడు.. పవన్ తో ఫోటో దిగడానికి అమర్ నాథ్ ఆరాటపడ్డారని.. ఛాన్స్ దొరకక పోవడంతో.. విష్ణు కుమార్ రాజ్ ను.. పవన్ తో ఒక ఫోటో తీయించమని రిక్వెస్ట్ చేశారని.. దీంతో పవన్ తో ఫోటో కావాలంటే తన ఇంటికి రావాలని విష్ణు సూచించడంతో.. అమర్ నాథ్ వెళ్లి ఫోటో దిగారు.. మరి గతాన్ని మంత్రి గుడివాడ మరిచిపోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు... అంతేకాదు.. మొన్నటి వరకు మీ రాసలీలలు కేవలం వైజాగ్ వరుకే తెలుసని.. ఇప్పుడు యావత్ భారత దేశం చూస్తోంది అంటూ ఆయన డ్యాన్సులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


  ప్రస్తుతం ఈ ట్రోల్ చూస్తుంటే.. పవన్ ఫ్యాన్స్ -మంత్రి మధ్య విమర్శల పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. వైసీపీ నేతలు చంద్రబాబు దత్తపుత్రుడు పేరుతో సినిమా తీస్తామంటే.. రాసలీలలు పేరుతో మంత్రులపై సినిమాలు తీస్తామని కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ అమర్ నాథ్ ఇష్యూ ట్రెండ్ గా మారుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan, Visakhapatnam, Ycp

  ఉత్తమ కథలు