AP POLITICS MINSITER DADISETTI RAJA MADE SENSATIONAL COMMENTS ON KONASEEMA RIOTS AS HE MADE ALLEGATIONS ON CHANDRABABU AND PAWAN KALYAN FULL DETAILS HERE PRN
Konaseema Tension: చంద్రబాబు, పవన్ డైరెక్షన్లోనే విధ్వంసం.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..
ప్రతీకాత్మకచిత్రం
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ (YSRCP) కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని దాడిశెట్టి రాజా (Dadisetti Raja) అన్నారు. ఆందోళనకారులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అని నినాదాలు చేశారని కావాలంటే వీడియోలు చూసుకోవాలన్నారు.
కోనసీమ జిల్లా (Konaseema District) పేరు మార్పుపై అమలాపురంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టే వరకు వెళ్లింది. ప్రస్తుతం అమలాపురంలో ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురంతో పాటు కొనసీమలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను మోహరించారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు (Chanrababu) కుట్ర ఉందదని ఆయన ఆరోపించారు. గతంలో తుని ఘటనకు చంద్రబాబే కారణమని.. ఇప్పుడు కూడా అమలాపురం ఘటనకు కూడా ఆయనే కారణమని చెప్పారు. ప్రజలందరి కోరికమేరకే కోనసీమ జిల్లా పేరు మార్చామని ఆయన గుర్తుచేశారు. కుట్ర ప్రకారమే మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారని.. హింస సృష్టించాలనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చారని.. ఇప్పుడు వాళ్లే అల్లర్లు చేయిస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజలన్నా, వ్వవస్థలన్నా గౌరవం లేదని.. ముందుముందు ఇలాంటి రాజకీయాలు చాలా చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంచి నాయకులుంటే వారికి వ్యతిరేకంగా పనిచేయడం చంద్రబాబు నైజమన్నారు. అప్పట్లో వంగవీటి రంగా, వైఎస్, ఇప్పుడు జగన్ మీద ఆయన కుట్రలు చేస్తున్నారన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని దాడిశెట్టి రాజా అన్నారు. ఆందోళనకారులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ అని నినాదాలు చేశారని కావాలంటే వీడియోలు చూసుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ వెనుకుండి ఆందోళనకారులను నడిపిస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉంటే కోనసీమలో జరిగిన అల్లర్ల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నంచి అమలాపురంకు బస్సు సర్వీసులను నిలిపేశారు. పట్టణంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాగే స్థానికంగా ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిపేసినట్లు తెలుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లా ఎస్పీలు స్వయంగా అక్కడుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అమలాపురంలో ఆందోళనల్లో విధ్వంసం సృష్టించిన వారిని పోలీసులు గాలించేపనిలో ఉన్నారు. వీడియోలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిరసనకారులను గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ పాలరాజు తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.