ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ (Bheemla Nayak)పై చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత పవన్ సినిమా రీలిజ్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతులివ్వకపోవడం, టికెట్ ధరలను పెంచకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. బెనిఫిట్ షోల కోసం ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడలో మంత్రులు కొడాలి నాని (Minister Kodali Nani), పేర్ని నాని (Minister Perni Nani) ని జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు.
శుక్రవారం పట్టణంలో జీ3 భాస్కర్ థియేటర్ ను ప్రారంభించేందుకు మంత్రులు హాజరయ్యారు. దీంతో మంత్రులను అడ్డుకునేందుకు పవన్ ఫ్యాన్స్ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు.. పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. జై పవన్ కల్యాణ్.. ప్రభుత్వ మొండి వైఖరి నసించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
థియేటర్లో భీమానాయక్ ప్రారంభ చిత్రం కావడంతో పెద్దసంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.జి 3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,తో పాటుగా పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ సినిమా ఎలాంటి ఇబ్బందులు లేవని.. కానీ ఏపీలోనే ప్రభుత్వం పవన్ సినిమాలను కక్షపూరితంగా అడ్డుకుంటోందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రమే తాము వచ్చామని.. తమను అడ్డుకోవడం దారుణమని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇదిలా ఉంటే బీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అధిక ధరకు టికెట్లు విక్రయించొద్దని, అదనపు షోలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. రూల్స్ బ్రేక్ చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నిబంధనలు అమలయ్యేలా చూడాలంటూ తహసీల్దార్లు వీఆర్వోలకు ఆదేశాలు జారీ చేసి థియేటర్ల వారీగా డ్యూటీలు కూడా వేశారు.
ఇది చదవండి: ఆయన అలా చేసేసరికి ఏడొపొచ్చింది.. చిరంజీవిపై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..
దీనిపైనా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పవన్ సినిమాలను దెబ్బకొట్టేందుకే ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఐతే టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా, అదనపు షోలు వేయకపోయినా భీమ్లా నాయక్ ను సూపర్ హిట్ చేస్తామని ఫ్యాన్స్ శపథం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, Bheemla Nayak, Kodali Nani