Visakha Garjana: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. జనసేన (Janasena) రెండింటినీ ఉత్తరాంధ్రను బ్యాన్ చేయాలని వైసీపీ (YCP) మంత్రులు పిలుపు ఇచ్చారు. ఉత్తరాంధ్ర అన్ని రంగంలో ముందుకు వెళ్లాలి అంటే వికేంద్రీకరణ అవసరమన్నారు. అయితే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు అడ్డుకుంటున్నారని మంత్రులు ఫైర్ అయ్యారు. ముందు నుంచి వైసీపీ నేతలు చెబుతున్నట్టు.. ఈ మహా గర్జనకు భారీగా హాజరయ్యారు. అది కూడా భారీ వర్షాన్ని సైతం లెక్క చేయలేదు.. నాన్ పొలిటికల్ జేఏసీ (Non Political JAC) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వేలాదిగా జనం పాల్గొన్నారు. విశాఖ (Visakha) ను రాజధానిగా చేయాలని.. అడ్డుపడుతున్న పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కారణంగా విశాఖ మొత్తం జన సంద్రంగా మారింది.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగనన్న సంకల్పం అన్నారు మంత్రి రోజా.. దానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు. మీ జన సునామీలో చంద్రబాబు, పవన్‌లు కొట్టుకుపోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించండి.. జగన్ మరోసారి గెలిపించండి అని పిలుపు ఇచ్చారు.
కలెక్షన్లు, షూటింగ్‌ల కోసం పవన్‌కు విశాఖ కావాలి. ఆయన పోటీ చేయడానికి విశాఖ కావాలి.. కానీ విశాఖలో రాజధాని మాత్రం వద్దా అని రోజా ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలన్నారు.
ఇదీ చదవండి : హోరు వానలోనూ తగ్గని జోరు.. మహా గర్జనతో హోరెత్తుతున్న విశాఖ
మంత్రి విడుదల రజనీ కూడా విపక్షాల తీరుపై మండిపడ్డారు. అన్ని రకాలుగా ముందున్న విశాఖను రాజధానిగా చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అందురూ బాగుండాలన్నదే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు అభి వృద్ధి చెందుతాయన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు.
ఇదీ చదవండి: ఛీ ఇన్ని అబద్దాలా..? బాలయ్య తీరుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మాజీ మంత్రి కొడాలి నాని . ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయమని.. అందుకే చంద్రబాబు నాయుడు మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడంటూ కొడాలి నాని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఆ ఫోటోలు మార్ఫింగ్ కాదు.. మంగళగిరిలో ఓటమికి కారణం అదే.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం చంద్రబాబు, పవన్ ల తీరుపై మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ఆరోపించారు. ఆ నేతలకు బుద్ధి వచ్చేలా జడివానను లెక్క చేయక జనం వచ్చారని గుర్తు చేశారు. ఈ ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్ అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైందని.. అందుకే భావితార కోసం తాము ఈ పోరాటం చేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Three Capitals, Visakhapatnam