హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: కేబినెట్ నుంచి మంత్రి సీదిరి అవుట్..! సీఎం జగన్ నుంచి పిలుపు.. అందుకేనా?

Breaking News: కేబినెట్ నుంచి మంత్రి సీదిరి అవుట్..! సీఎం జగన్ నుంచి పిలుపు.. అందుకేనా?

మంత్రి సీదిరి అప్పల రాజుకు సీఎం జగన్ నుంచి పిలుపు

మంత్రి సీదిరి అప్పల రాజుకు సీఎం జగన్ నుంచి పిలుపు

Breaking News: ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పల రాజును కేబినెట్ తప్పిస్తున్నారా..? సీఎం జగన్ నుంచి కవాలి అంటూ సీదిరికి ఫోన్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన పలాసలో పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని సీఎం దగ్గరకు బయలు దేరారు.. కారణం అదే అయ్యి ఉంటుందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

Beaking News:  ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju)కు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  నుంచి ఫోన్ వచ్చిందని సమాచారం.  ఉన్నఫలంగా వచ్చేయాలంటూ సమాచారం అందడంతో.. ఆయన పలాసలో ఉన్న తన కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని బయలు దేరారని తెలుస్తోంది.. అయితే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందని వైసీపీ (YCP) వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే ముగ్గురుని కేబినెట్ నుంచి తప్పించి.. మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాల్లో టాక్..  అయితే తప్పించే మంత్రుల జాబితాలో సీదిరి అప్పలరాజు కూడా ఉన్నారని ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన పట్ట భద్రుల ఎన్నికల్లో (Graduate MLC Elections) ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఓడింది. దీనికి తోడు సీదిరిపై సొంత పార్టీకి చెందిన నేతలు, సొంత సామాజిక వర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన్ను జగన్ పిలిపించి ఉంటరాని.. కేటినెట్ నుంచి తప్పిస్తానని ముందస్తు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సాధారణంగా నేరుగా సీఎం పిలుస్తున్నారంటూ మంత్రికి ఫోన్ రావడంతో.. కచ్చితంగా మంత్రి పదవి నుంచి తప్పించేందుకే అని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మంత్రి మాత్రం.. శాఖపరమైన చర్చల కోసమే తనను రమ్మని ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటే గురువారమే సీదిరి తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తనపై వస్తున్న భూ అక్రమణలపై ఘాటుగా స్పందించిన ఆయన.. తాను గానీ, తన అనుచరులు గాని ఎక్కడైనా ఇంచు భూమి ఆక్రమించామని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను తప్పు చేసినట్టే అని అన్నారు. పలాస నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు. అయితే టీడీపీ నాయకులు 600 కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జా అయ్యాయని మీడియా ముందు పదేపదే చెబుతున్నారని.. ఆక్రమణ జరిగితే స్పందన కార్యక్రమంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. తన అనుచరులు తప్పు చేశారని నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాజకీయల నుంచి తప్పుకుంటాను అన్నారు.

ఇదీ చదవండి : చెవిరెడ్డి రాజకీయ సన్యాసం..! సీఎం జగన్ విరవిధేయుడు నిర్ణయానికి కారణం అదేనా?

కేవలం టీడీపీ నేతలే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం సీదిరి వ్యవహారంపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఇటీవల సీఎం జగన్ తెప్పించుకున్న నివేదికల్లోనూ సీదిరికి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ప్రతికూలంగా ఉందని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ప్రత్యేకంగా పిలిపించి ఉంటరాని.. మంత్రపదివి నుంచి తప్పిస్తున్నామని చెబుతారా..? లేక సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తారా..  లేక ఆయన శాఖకు సంబంధించి చర్చల కోసమే పిలిచారా అన్నది ఆసక్తికరంగా మారింది..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు