Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER ROJA WARNS POLITICAL RIVALS AS SHE GETS GRAND WELCOME IN NAGARI FULL DETAILS HERE PRN

Minister Roja: "ఇప్పటివరకు ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క.." నగరిలో మంత్రి రోజా రాయల్ ఎంట్రీ.. వారికి వార్నింగ్

నగరిలో రోజాకు ఘనస్వాగతం

నగరిలో రోజాకు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister Roja) తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ (YSRCP) లోని అసమ్మతి నేతలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలెదుర్కొంటున్న ఆమె మంత్రి పదవి దక్కించుకొని అందరి నోళ్లు మూయించారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister Roja) తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ (YSRCP) లోని అసమ్మతి నేతలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలెదుర్కొంటున్న ఆమె మంత్రి పదవి దక్కించుకొని అందరి నోళ్లు మూయించారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. తొలిసారి తన సొంత నియోజకవర్గమైన నగరిలో అడుగుపెట్టారు. ఆమెకు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రోజా పూలతో చేసిన భారీ గజమాలతో ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రోజా తనదైన శైలిలో ప్రతిపక్షాలపై, తన అసమ్మతి వర్గంపై మండిపడ్డారు. ఇన్నాళ్లు రోజూ ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చిన రోజా ఈరోజు మంత్రిగా మీ ముందుకు వచ్చిందన్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఒకలెక్క.. ఇకపై మరొలెక్క అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.

  రోజా పనైపోయిందని.. ఆమెకు టికెట్ రాదంటూ చాలా మంది నానా రకాలుగా మాట్లాడారని.. అలాగే ప్రతిపక్షాలు తనపై అనవసర నిందలు వేశారని.. ఇప్పుడు తాను మంత్రిగా తిరిగొచ్చానంటూ గర్వంగా చెప్పుకున్నారు రోజా. ఓడిస్తాను ఓడిస్తాను అంటూ ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడేమయ్యారన్నారు. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని రోజా అన్నారు. టూరిజం శాఖను సమర్ధవంతంగా నిర్వహించి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి మంత్రిగా మీ దగ్గర మంచిపేరు తెచ్చుకుంటానన్నారు.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ కోతలకు త్వరలోనే ముగింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..


  తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి రావడానికి కారణమైన నగరి ప్రజల మేలును జన్మలో మర్చిపోలేనన్నారు మంత్రి రోజా. అలాగే తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని.. ఆయన గెలుపుకు కృషి చేస్తానని ప్రకటించారు. మరో 30 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉంటారని.. తాను నగరి నుంచే మళ్లీ గెలుస్తానని.. వార్ వన్ సైడేనని ధీమా వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక ప్రకటన.. దర్శనానికి టెన్షన్ అక్కర్లేదు..!


  భగవంతుని ఆశీస్సులు., జగన్ అండదండలు, నగరి ప్రజల ప్రేమతో తిరుపతి జిల్లాకు మంత్రి అవ్వడం చాల సంతోషంగా ఉందన్నారు రోజా. భగవంతుని సేవతో పాటు., ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారమె. నా ప్రాణం అనంత వరకు జగన్ అన్న వెంటనే ఉంటాని స్పష్టం చేశారు. ఎస్టీ., ఎస్సి, బిసి మైనారిటీలకోసం జగన్ అన్న ప్రవేశ పెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాని తెలిపారు. నాకు కేటాయించిన పర్యాటక శాఖ అభివృద్ధి., మన సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తానని.., గ్రామ గ్రామానా క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. తనకు మంత్రి పదవి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నట్లు రోజా తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Roja Selavamani

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు