Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER ROJA SLAMS TDP CHIEF NARA CHANDRABABU NAIDU OVER POLAVARAM AND DEVELOPMENT IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Minister Roja: అది ఆయన పిచ్చితనమే.. భజన బ్యాచ్ ఎక్కువయ్యారు.. రోజా హాట్ కామెంట్స్..

మంత్రి రోజా

మంత్రి రోజా

చంద్రబాబు (Chandra Babu Naidu) సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారన్నారు ఏపీ మంత్రి రోజా. (Minister Roja) సోమవారం తిరుమల శ్రీవారి ( Tirumala Sirvaru) ని దర్శించుకున్న ఆమె.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు.

    చంద్రబాబు (Chandra Babu Naidu) సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారన్నారు ఏపీ మంత్రి రోజా. (Minister Roja) సోమవారం తిరుమల శ్రీవారి ( Tirumala Sirvaru) ని దర్శించుకున్న ఆమె.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. తిరుపతి (Tirupati) లో పుట్టిన తనకు శ్రీనివాసుడి ఆశీస్సులతో మంత్రిగా అవకాశం దక్కిందని.., రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాని ఆమె అన్నారు. జగనన్న ఆశీస్సులుతో రెండు సార్లు గెలిచి, ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సీఎం కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని‌ పరుగులు తీయించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలపారు. వరదలు తగ్గిపోయిన తర్వాత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు రోజా. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందించకుండా, అభివృద్ధి చేయకుండా.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు.

    రాష్ట్రాన్ని అప్పుల్లో‌ ముంచిన చంద్రబాబు.. ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశారని రోజా అరోపించారు. గోదావరి వరదల్లో ప్రజలందరికీ రెండు వేల రూపాయలు అందించామని.., వాలంటీర్ల ద్వారా రేషన్ గానీ, పాలు, కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి అందరి మన్నలను పొందామన్నారు. సీఎం ప్రజల వద్దకు వెళ్లిన సమయంలో వారంతా అక్కున చేర్చుకుని తమ అభిమానం చూపారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడుకి పేటిఎం బ్యాచ్ తో భజనలు చేయించుకోవడం అలవాటు అనేది గతంలో చేశామి., పోలవరం కట్టకుండానే బస్సు వేసి రాష్ట్ర నలుమూలల నుండి టిడిపి నాయకులను తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న అంటూ భజన చేయించారన ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: ఏపీలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇక ఈజీ.. ప్రభుత్వం కొత్త ఆలోచన.. త్వరలోనే అందుబాటులోకి


    చంద్రబాబు చేసిన విధంగానే అందరూ చేస్తారు అని అనుకోవడం ఆయన పిచ్చితనమని సెటైర్లు వేశారు రోజా. పోలవరం దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి కట్టడం చేత కాదని.., దిగిపోతే కడతానంటూ బీరాలు పోతున్న చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కట్టకుండా గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు.


    ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త జీతాలు


    రాష్ట్ర విభజన తరువాత కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు పోలవరంను పూర్తి చేయలేక చేతగాని తనాన్ని ప్రదర్శించారని.. డబ్బుపిచ్చితో స్వలాభం కోసం ప్యాకేజీకి ఒప్పుకొని పోలవరాన్ని ఏటీఎం కార్డులాగా వాడుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు నష్ట పోతున్నారని.., ఇప్పుడు ఆర్ అండ్ ఫ్యాకేజీ రావాల్సిన మండలాలన్నీ ఇబ్బంది పడుతున్నాయంటే అందుకు చంద్రబాబే కారణమని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రూ.20 వేల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధుల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి అయితే ముప్పు మండలానన్నీ ఓ జిల్లాగా చేస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం ఉందని రోజా అన్నారు. కుప్పం ను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్ గా చేయలేకపోయిన చంద్రబాబు... కొత్త జిల్లా ఎలా ఏర్పాటు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Minister Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు