AP POLITICS MINISTER ROJA SLAMS OPPOSITION LEADERS WITH NANDAMURI BALA KRISHNA DIALOGUES IN ATMAKUR BY ELECTION CAMPAIGN FULL DETAILS HERE PRN
Minister Roja: ఆ బ్లడీ ఫూల్స్ బాక్స్‌లు బద్దలే.. మంత్రి రోజా నోట బాలయ్య బాబు మాట
మంత్రి రోజా (File)
ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించిన వైఎస్సార్సీపీ.. చేజర్ల మండలం బాధ్యతలు రోజా (Minister Roja) కి అప్పగించింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో ఆదివారం పర్యటించిన ఆమె.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna) డైలాగ్స్‌తో ఓటర్లలో జోష్ నింపారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక (Atmakur by election) ప్రచారం జోరుగా సాగుతోంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati Gowtham Reddy) హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పోటీ నుంచి ప్రధాన ప్రతిపక్షం దూరం కాగా.. బీజేపీ (BJP) ఎన్నిక బరిలో నిలిచింది. వైఎస్సార్సీపీ (YSRCP) తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో.. భారీ మెజార్టీతో గెలిపించేందుకు అధిష్టానం కృషి చేస్తోంది. నియోజకవర్గంలోని మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించిన వైఎస్సార్సీపీ.. చేజర్ల మండలం బాధ్యతలు రోజా (Minister Roja) కి అప్పగించింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో ఆదివారం పర్యటించిన ఆమె.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna) డైలాగ్స్‌తో ఓటర్లలో జోష్ నింపారు.
రాష్ట్రంలో సీఎం జగన్‌ని వ్యతిరేకించే బ్లడీ ఫూల్స్ బాక్స్‌లు బద్దలవ్వాలంటూ ట్రెండీ డైలాగ్‌తో ప్రత్యర్థులపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే వాళ్ల నోళ్లు మూయించాలంటూ రోజా పిలుపునిచ్చారు. అజాతశత్రువైన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అందర్నీ బాధించిందని.. ఇప్పుడు ఆయన స్థానంలో తమ్ముడు విక్రమ్ రెడ్డిని అధిష్టానం బరిలో నింపిందని.. ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆత్మకూరు గడ్డ.. మేకపాటి గడ్డ, జగనన్న అడ్డా అని చాటి చెప్పే అవకాశం మరోసారి వచ్చిందని.. భారీ మెజార్టీతో గెలిపించి శత్రువులకు బుద్ధి చెప్పాలంటూ రోజా పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో మేకపాటి కుటుంబాన్ని గెలిపించి.. గౌతమ్ రెడ్డికి నివాళులర్పించాలని కోరారు.
రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించిన 15 మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాసే చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా కొనియాడారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో మీరు వేసే ఓటు గౌతమ్ రెడ్డి మంచితనానికి, జగనన్న సుపరిపాలనకు వేసే ఓటు అని గుర్తుంచుకోవాలన్నారు.
ఇదిలా ఉంటే శనివారం తిరుమలలో మాట్లాడిన సందర్భంగా టీడీపీ నేతలపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు రోజా. ఇక అచ్చెన్నాయుడు వాలకం చూస్తుంటే పార్టీని ఎప్పుడెప్పుడు మూసేద్దామా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ గెలిస్తే పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పారన్నారు. తెలుగుదేశం., చంద్రబాబు లోకేష్ పై అచ్చం నాయుడుకు ఎంత కోపం ఉందో తెలుస్తోందన్నారు రోజా. కుప్పంలో ఓటమి తర్వాత పార్టీని మూసేయాలనేది అచ్చెన్న ప్లాన్ అన్నారు. తిరుపతి ఎన్నికల సమయంలోనే పార్టీలేదంటూ కామెంట్ చేశారని రోజా గుర్తుచేశారు. అచ్చెన్నకు బాడీ పెరిగిందిగానీ.. బుర్రపెరగలేదంటూ సెటైర్లు వేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.