Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrbabu Naidu) సభలు రాజకీయ రచ్చకు వేదిక అవుతున్నాయి. ఎందుకంటే రెండు సమావేశాల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అవన్నీ చంద్రబాబు చేసిన హత్యలే అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఘటనలపై మంత్రి రోజా (Minister Roja) తనదైన స్టైల్లో పంచ్ లు వేశారు. ఈయన చంద్రబాబు నాయుడా.. శవాల నాయుడా..? అంటూ రోజా ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవడం తమ అదృష్టం అని ప్రజలు అనుకుంటున్నారని.. అది చూసి చంద్రబాబు అండ్ కో ఓర్వలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. 2022లో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్నారని.. ఆయన కొడుకు కూడా ఐరన్ లెగ్ అయ్యాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ తమ వైఖరి వైఖరి మార్చుకోవాలన్నారు..
జల ప్రాణాలు తీస్తున్న వారు ఎవరైనా ఉపేక్షించండం కుదరదన్నారు.. తన సభలకు జనం రాకపోవడంతో.. ఇలా చీరలు, కానుకలు ఇస్తారని పిలిచి చంద్రబాబు జనాన్ని చంపుతున్నారని మండిపడ్డారు. ఇలాగే మనుషులు చంపేందుకు కారణమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతామన్నారు. పనికిమాలిన వాటికి చెప్పులు చూపించే పవన్ కళ్యాణ్ మహిళలు ప్రాణాలు పోతే పట్టదా..? పవన్ కళ్యాణ్ ప్యాకేజికి తప్ప పాలిటిక్స్ కి పనికి రాడా..? ఇదేం ఖర్మ రా..బాబు అని ప్రజలు అనుకుంటున్నార’ని రోజా విమర్శించారు.
కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే మాత్రమే చంద్రబాబు రాష్ట్రానికి వస్తారని, లోకేష్ పప్పు తినటానికి మాత్రమే పనికి వస్తారని, వీరికి తోడు రెండు చోట్ల ఓడిపోయిన దత్త పుత్రుడు పవన్ కూడా అదే బాటలో వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చంకలో కూర్చోవటం మినహా పవన్ కు మరొక పని లేదన్నారు.
ఇదీ చదవండి : చంద్రన్న కానుకలో తొక్కిసలాటపై పవన్ సంచలన ప్రకటన.. చర్యలు చేపట్టాలని డిమాండ్
ఏపీ ప్రజలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని.. అయినా ప్రజలు పట్టించుకోరని ఆరోపించారు. ‘విశాఖపట్నానికి పవన్ వ్యతిరేకి అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని, వారం రోజుల క్రితం కందుకూరులో 8 మందిని, గుంటూరులో 3ని చంపేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ మొత్తం 40 మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: పార్టీ అధినేత కాదు యముడు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఇంత జరుగుతున్నా మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన రోజా లోకేష్ పాదయాత్రపై కూడా స్పందించారు. లోకేష్ పాదయాత్ర డైవర్ట్ చేయటానికే వైసీపీ నేతలు ఇది చేశారని టీడీపీ నాయకులు అంటున్నారని అలా అనడానికి వారు అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న ఏపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా స్పందించారు. ‘ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చెయ్యొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ని అన్యాయంగా విభజించారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆ పార్టీ వాళ్ళు ఏపీకి రావాల్సిన వాటిపై ముందుగా సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఓటుకు నోటు కేసుని అడ్డం పెట్టి ఏపీకి నష్టం చేశారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Minister Roja