Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER ROJA SHOCKING COMMENTS ON JR NTR AND TDP POLITICS SB

Roja: జూనియర్ ఎన్టీఆర్‌పై రోజా షాకింగ్ కామెంట్స్.. టీడీపీలో కొత్త భయం!

రోజా, జూనియర్ ఎన్టీఆర్

రోజా, జూనియర్ ఎన్టీఆర్

టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జూనియర్‌ను తెలుగు తమ్ముళ్లు పక్కన పెట్టేశారు.

    ఏపీ రాజకీయాలు వాడి వేడిగానే సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వరుసగా మాటల యుద్ధం నెలకొంటుంది. ఈ విమర్శల్లోకి మధ్యలో జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr Ntr) కూడా లాగేస్తున్నారు రాజకీయ నేతలు.. తాజాగా ఏపీ ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ప్రముఖ సినీ నటి ఆర్కే రోజా(RK Roja) గత కొద్ది రోజులుగా టీడీపీ (Tdp)  నాయకులిపై విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నగరి నియోజకవర్గ నేతలతో కలిసి మంత్రి రోజా శనివారం ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బతికే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎంటో అందరికీ తెలుసన్నారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రోజా(Roja) . జూనియర్ ఎన్టీఆర్‌కు భయపడి పార్టీ నుంచి ఆయన్ను తరిమేసారని ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు ప్రేమతో ఆదరిస్తున్నారని తెలిపారు.

    అయితే  మంత్రి రోజా (Minister Roja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజా వ్యాఖ్యలతో టీడీపీలో కొత్త భయం పట్టుకుంది. ఎందుకంటే.. అవసరం వచ్చినప్పుడు జూనియర్‌ను వాడుకునేలా టీడీపీ అగ్రనేతలు వ్యూహాలు వేసుకున్నారు. 2009 ఎన్నికల్లో స్టార్ కాంపైనర్‌గా టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తన వాళ్లకు కూడా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అప్పుడు టీడీపీ కూడా భారీ మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. పలకరించే సాహసం కూడా చేయడం లేదు. నారా వారసుడికి పోటీ వస్తాయన్న భయంతో చంద్రబాబు జూనియర్‌ను పక్కన పెట్టారన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. అటు హరికృష్ణ కూడా బతికి ఉన్నప్పుడు పలు సందర్భాల్లో బావ చంద్రబాబుపై విమర్శలు కూడా గుప్పించారు.

    అయితే ఇదంతా గతం. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈసారి ఎలాగ అయినా.. అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఏపీలో ఈసారి టీడీపీ కచ్చితంగా అధికారంలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో తెలుగు దేశం పార్టీని ఈసారి గెలిపించుకోకపోతే ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందన్నది పార్టీలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఇపుడు కాకపోతే మరెప్పుడు అని జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వైపుగా లాగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

    కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలలో తన ఎంట్రీ మీద పక్కా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు సినిమాలే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పేసారు. అయితే అదే టైం లో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించను అని ఆయన కుండబద్ధలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తూంటే జూనియర్ ఎన్టీయార్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉంది కానీ ప్రస్తుతం మాత్రం ఆయన ఫుల్ క్లారిటీతో సినిమాలు చేసుకుంటారు అని అర్ధం చేసుకోవాలి. అయితే ఎన్టీఆర్ నాన్ స్టాప్ గా 2029 ఎన్నికల వరకు వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ అపుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు అని పలువురు చర్చించుకుంటున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chandrababu Naidu, Jr ntr, Minister Roja, Rk roja, TDP

    తదుపరి వార్తలు