Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER ROJA SHOCKED BY ONE OLD MAN IN GADAPA GADAPAKU PRABUTWAM IN CHITOOR DISTRICT NGS GNT

Minister Roja: గడప ముందుకొచ్చిన రోజా.. పెళ్లి చేయమన్న వృద్ధుడు.. మంత్రి రియాక్షన్ ఇదే

అవాక్కైన మంత్రి రోజా

అవాక్కైన మంత్రి రోజా

Minister Roja: గడపగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా ప్రజల బాట పట్టారు. అయితే అలా వెళ్తున్నవారికి నిరసన సెగలు, వింత వింత ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఇక మంత్రి రోజా అయితే ఓ వృద్ధుడి కోరిక విని అవాక్కయ్యారు..

ఇంకా చదవండి ...
    Minister Roja: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎన్నికలకు రెండుళ్లకు పైగా సమయం ఉన్నా..? ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పొత్తుల విషయంలో దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Prabutwam) తో.. ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో (YCP Menifesto) తీసుకుని వెళ్తున్నారు. ఇంత వరకు ప్రభుత్వ పథకాలు ఎన్ని అందాయా..? అర్హత ఉన్న వారందరికీ పథకాలు అందున్నాయా..? ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. అయిత కొన్ని చోట్ల సాధారణంగానే ప్రజలు ఆహ్వానిస్తూ తమ స్యమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం నిరసన సెగలు తప్పడం లేదు. మాకు ఉచిత పథకాలు వద్దు.. సమస్యలు లేకుండా చూడండి అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే గట్టిగానే నిలదీస్తున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. సమాధానం దాటవేసి  అక్కడ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నారు ప్రజా ప్రతినిధులు..  మరికొందరికి వింత వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయి..

    పర్యాటక మంత్రి రోజా కూడా చిత్తూరు జిల్లాలోని నగరిలో గడపగడపకు మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి రోజా ఆమె నగరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో వింత కోరిక విని ఆమె నోరు వెళ్లబెట్టారు. తనకు తోడు ఎవరూ లేరని.. ఒంటరిగా బతకలేకపోతున్నానని ఓ వృద్ధుడు రోజా ఎదుట మొరపెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా మంత్రి రోజానే అడిగాడు. వృద్ధుడి కోరిక విన్న రోజా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

    ఇదీ చదవండి : మళ్లీ తెరపైకి సత్యం బాబు.. ఆ పని చేయండి ప్లీజ్ అంటూ ప్రభుత్వానికి వినతి

    పెన్షన్ అయితే ఎలాగోలా ఇప్పిస్తాం.. కానీ పెళ్లి చేయలేమంటూ మంత్రి రోజా వృద్ధుడితో పేర్కొన్నారు. అయితే.. పింఛన్ వస్తుంది కానీ.. నీడ, తోడు లేదంటూ మంత్రికి చెప్పాడు. అయితే.. వృద్ధుడి కోరిక విని.. అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

    ఇదీ చదవండి : : మళ్లీ తెరపైకి సత్యం బాబు.. ఆ పని చేయండి ప్లీజ్ అంటూ ప్రభుత్వానికి వినతి

    ఈ ఘటన పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది..మరి అవన్నీ ప్రజలకు అందుతున్నాయా..? సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో సంతోషం ఉందా.. లేక ఎక్కడైనా లోటు పాట్లు ఉన్నాయా అని ఆమె ఆరా తీస్తున్నారు. ఒకవేళ నిజంగా ఎక్కడైనా ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే.. ఆ సమస్యలు పరిష్కరిస్తే.. మళ్లీ అధికారంలోకి ఈజీగా రావొచ్చన్నది వైసీపీ నేతల భావనవ.. అందుకే ఇలా గడప గడపకు వెళ్తే.. ప్రభుత్వం పని తీరు ఎలా ఉందని నేరుగా ప్రజలనే అడుగుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chitoor, Minister Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు