హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: బావ కళ్లలో ఆనందం కోసమే.. బాలయ్య అన్ స్టాపబుల్ షో పై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: బావ కళ్లలో ఆనందం కోసమే.. బాలయ్య అన్ స్టాపబుల్ షో పై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

 మంత్రి రోజా (file)

మంత్రి రోజా (file)

Minister Roja: పండగా సినిమాగా వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దక్కించుకుంది. సినిమా హిట్టాపట్టా అనే సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా అందులో పేల్చిన పొలిటికల్ పంచ్ డైలాగ్ లు వైరల్ అవుతున్నాయి. జై బాలయ్య జైజై బాలయ్యా అనే నినాదం మారుమోగుతోంది. అయితే ఆయన సినిమా డైలాగ్ లపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagari, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Minister Roja: వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమాలో బాలయ్య డైలాగ్ లు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ఆర్ కె రోజా (RK Roja) తనదైన స్టైల్లో బాలయ్య డైలాగులపై మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు మంత్రి రోజా . రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా.. ముగ్గులపోటీ నిర్వహించి బహుమతులు అందచేశారు. కుటుంబ సబ్యులతో కలిసి పండగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

చెల్లిగా , హీరోయిన్ గా , ఎమ్మెల్యేగా , మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడ పండగ చేసుకున్నాను అన్నారు. సంక్రాంతి రైతుల పండుగ , రైతులు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.

ఇదీ చదవండి : ఇద్దరిని హత్య చేసిన కోడి.. ఎలా జరిగింది అంటే..?

ఈ సందర్భంగా ఆమె.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో పై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  బావ కళ్ళలో ఆనందం చూడటానికే బాలకృష్ణ అలా చేస్తున్నారని మండిపడ్డారు.  బావ మోసాలు కప్పిపుచ్చేందుకు బాలకృష్ణ చాల కష్టపడుతున్నారని విమర్శలు చేసారు. అన్ స్టాపబుల్ కార్యక్రమం కేవలం..  స్క్రిప్ట్ అని ప్రజలు గ్రహించారని ఆమె అన్నారు.

ఇదీ చదవండి : తాతయ్యలను ఆటపట్టించిన నారా దేవాన్ష్.. సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన చంద్రబాబు మనవళ్లు

ప్రజలు ఎలా ఉన్న.. బావ మీటింగ్ జరగాలి.. భావ కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి  డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే వారి పట్ల సానుభూతి చూపకపోవడం.. ఆ విషయం గురించి మాట్లాడకపోవడం ముమ్మాటికీ తప్పేనన్నారు.

ఇదీ చదవండి : ఏపీలో బీఆర్ఎస్ విస్తరించడమే లక్ష్యమా..? సోమేశ్ కుమార్ బదిలీ వెనుక రీజన్ అదేనా..?

దాన్యబండాగారంగా పేరొంది..  మూడు పంటలు పండే భూమిని ఓ స్వామీజి చెప్పిన మాటలు విని బీడు భూమి చేసారని ఆరోపణలు చేసారు. మహిళా సదస్సుకు ఆహ్వానం పంపి తనను చంపాలని చూసిన వాళ్ళు టీడీపీ నాయకులని ఆరోపించారు. ప్రజా పోరులో బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు..  అలాంటి బాలకృష్ణకి  మీకు ప్రజల కష్టాలు బాగా తెలుసన్నారు.

ఇదీ చదవండి : సద్దుమణిగిన దున్నపోతు సమస్య.. చివరికి ఏం తేల్చారంటే..?

ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయినా పవన్ కి తెలియకపోవచ్చని సెటైర్లు వేశారు.  జీవో నంబర్ వన్ పూర్తిగా చదవకుండానే బాలకృష్ణ ఎమర్జెన్సీ అనే మాట మాట్లాడటం సబబు కాదన్నారు.  దాన్ని పూర్తిగా చదివితే తన మాటను వెనక్కి తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు అని నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట అంటూ మండిపడ్డారు. సినిమాల్లో చెప్పే డైలాగులు కేవలం చప్పట్ల కోసమే అని.. అలాంటి డైలాగులతో పల్లెలు బాగుపడవని రోజా అన్నారు.

ఇదీ చదవండి: కోట్లలో కోడి పందాలు.. బరుల దగ్గర గోవా కల్చర్

బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్ధం కావడంలేదన్నారు. బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఉందనే అనుకుంటున్నారని..  ద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని కోరారు. స్క్రిప్టులు రాసిఇచ్చినా మాట్లాడలేని పరిస్థితి బాలకృష్ణది అంటూనే.. 11 మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Nandamuri balakrishna, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు