Minister Roja: కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వెళ్లారు మంత్రి రోజా (Minister Roja).. మరోవైపు బ్యాట్ తో బౌండరీలు బాదారు. ఎక్కడ అంటే..? నగరి నియోజకవర్గంలోని నగరి (Nagari) డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన ఏపి పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి ఆర్.కే.రోజా.. కాసేపు విద్యార్థులతో ఆట ఆడారు. ఈ క్రీడా పోటీలకు చిత్తూరు జిల్లా (Chittoor District) నుండి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చేందిన క్రీడాకారుకు పాల్గొన్నారు. కేవలం అందరిలో పోటీలను ప్రారంభించి.. నాలుగో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. క్రీడాకారులతో కలిసి క్రికెట్, కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు..
తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గల వారని, నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం, ఆనందంగా భావిస్తున్నట్లు చెప్పారు.. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృధికి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగన్ అన్న అని ఆమె కొనియాడారు.. దేశ జనాభాలో ఎక్కువ శాతం 50శాతం యువకులు ఉండటం మన అదృష్టంమని, వీరికి చదువుతో పాటు, స్పోర్ట్స్ చాలా అవసరంమన్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీమ్ ను పంపిస్తారని, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహణ జరుగుతుందని తెలిపారు.. రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా పోటీలు పెట్టడం ఇదే మొదటి సారి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశంమన్నారు.
ఇదీ చదవండి : ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు విషయంలో క్లారిటీ.. అధికారులు ఏమన్నారంటే..?
క్రీడాకారులు గ్రామ సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చునని, వారికి నచ్చిన క్రీడల్లో రాణించడానికి మంచి అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేక పోతున్నారని, వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేక పోవడం వారికి కావలసినదని ఆమె విమర్శించారు. కార్పొరేట్ స్థాయి విద్యార్థులే, రాష్ట్రంలో టిడిపి వాళ్ళని, జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేక పోతూ భజన అంటున్నారని, భజన అంటే ఎలా ఉంటుంది అంటే వై.ఎస్. ఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు ఇది భజన అంటూ వ్యంగంగా మాట్లాడారు.
ఇదీ చదవండి : పవన్ పోటీ చేసే ప్లేస్ ఏది..? పిఠాపురమా? భీమవరమా? జనసేనాని మనసులో ఏముంది..?
క్రీడలు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగుపడుతుంది. క్రీడలు అనేవి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి జోష్ తీసుకువస్తాయని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పోర్ట్స్ లో ముగ్గురికి గ్రూప్ వన్ పోస్ట్ లు వచ్చారన్నారు.. చదువు ఎంత ముఖ్యమో, స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యంమని, కోవిడ్ సమయంలో ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేశామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja