హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: 'అడ్డంగా పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు..' జెండా పీకేయడం ఖాయం.. రోజా హాట్ కామెంట్స్..

Minister Roja: 'అడ్డంగా పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు..' జెండా పీకేయడం ఖాయం.. రోజా హాట్ కామెంట్స్..

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

టీడీపీ (TDP) ని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు (Atchennaidu) ఉన్నట్లు మంత్రి రోజా (Minister Roja) విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి అదే గతిపడుతుందన్నారామె. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ఇంకా చదవండి ...

టీడీపీ (TDP) ని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు (Atchennaidu) ఉన్నట్లు మంత్రి రోజా (Minister Roja) విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి అదే గతిపడుతుందన్నారామె. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పార్టీకి కస్టపడి పనిచేసిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారని.., గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని రోజా అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని.., సంక్షేమ పథకాలకు కొత్త పెట్టకుండా ప్రజలకు ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. అర్హత ఉన్నవారికి కచ్చితంగా పధకాలు అందుతున్నాయని.., ప్రజాధారణ చూసి చంద్రబాబు, లోకేష్ లు కోడి గుడ్డుపై ఈక పీకినట్లు వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు, లోకేష్ లు ఏడుస్తున్నారన్న రోజా.., టెన్త్ క్లాస్ విద్యార్థుల ఉతీర్ణత సాధించడం కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పిల్లలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని.., ఫెయిల్ అయిన విద్యార్థులతో మీటింగ్ పెట్టారని విమర్శించారు. మీటింగ్ లోకి కొడాలి నాని వెళ్లడంతో కంగుతినిపోయారన్నారు. ప్రభుత్వానిది తప్పే అయితే జూమ్ మీటింగ్ లో వచ్చిన మా లీడర్స్ ను నిలదీసి ఉండాల్సిందన్నారు.

ఇది చదవండి: ఇక జనంలోకి జనసేనాని.., దసరా నుంచి పవన్ యాత్ర.. వివరాలివే..!


ఇక అచ్చెన్నాయుడు వాలకం చూస్తుంటే పార్టీని ఎప్పుడెప్పుడు మూసేద్దామా అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ గెలిస్తే పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పారన్నారు. తెలుగుదేశం., చంద్రబాబు లోకేష్ పై అచ్చం నాయుడుకు ఎంత కోపం ఉందో తెలుస్తోందన్నారు రోజా. కుప్పంలో ఓటమి తర్వాత పార్టీని మూసేయాలనేది అచ్చెన్న ప్లాన్ అన్నారు. తిరుపతి ఎన్నికల సమయంలోనే పార్టీలేదంటూ కామెంట్ చేశారని రోజా గుర్తుచేశారు.


ఇది చదవండి: పన్నుల వసూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. మరోసారి ఓటీఎస్ సిస్టమ్.. వివరాలివే..!


జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టబోయే బస్సు యాత్రపైనా రోజా స్పందించారు. పవన్ యాత్ర జనసేన కార్యకర్తల కోసమా లేక.. ప్రజల కోసమా అనే క్లారిటీ ఉండాలన్నారు. చంద్రబాబుకి కష్టం వస్తే.., పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని రోజా విమర్శించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, మంత్రి అయ్యి ఎమ్మెల్యే కానీ లోకేష్ కు సీఎం జగన్ ను విమర్శించే స్థాయిలేదన్నారు రోజా. మా ఎమ్మెల్యేల స్థాయి కూడా మీకు లేదంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీకి దమ్ము దైర్యం ఉంటె టీడీపీ మేనిఫెస్టో., వైసీపీ మేనిఫెస్టో పోల్చి చూడాలని రోజా సవాల్ చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని 23 సీట్లకే పరిమితం చేశారని.., కుప్పంలో కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని రోజా మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో భూస్థాపితమైన పార్టీ.. ఏపీలోనూ మూతపడటం ఖాయమని రోజా జోస్యం చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Minister Roja

ఉత్తమ కథలు