Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER ROJA MADE INTERESTING COMMENTS ON YS JAGAN AT YSRCP PLENARY FULL DETAILS HERE PRN GNT

Minister Roja in Plenary: వేటాడే పులి.., జగనన్న వన్స్ మోర్.. ప్లీనరీలో రోజా డైలాగ్స్ అదుర్స్

వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి రోజా

వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి రోజా

గుంటూరు (Guntur District) లో వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా మాట్లాడిన మంత్రి రోజా (Minster Roja).. తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు.

    గుంటూరు (Guntur District) జిల్లాలో వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary-2022) ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా మాట్లాడిన మంత్రి రోజా (Minster Roja).. తనదైన స్టైల్లో పంచ్ డైలాగులు పేల్చారు. అంతేకాదు సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. వైసీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదని.., దేశాన్ని గడగడలాడించిన సోనియాను గడగడలాడించిన పార్టీ అని.., వెన్నుపోటు దారుడు చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ అని రోజా అన్నారు. వైఎస్ఆర్ లాంటి మహానేత మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఓ విజేతగా మనందరి ముందు జగన్ నిలబడ్డాడని రోజా అన్నారు. అలాగే దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీని నిలబెట్టారన్నారు. ఈరోజు జగన్ ను స్వర్గంలో ఉన్న వైఎస్ఆర్.. దేవుడికి తన బిడ్డను చూపించి గర్వంగా చెప్పుకుంటారని రోజా అన్నారు.

    వైసీపీ జెండా జగనన్న ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమని రోజా అన్నారు. కాన్ఫిడెన్స్ కు కటౌట్ వేస్తే జగన్ లా ఉంటుందని.., కమిట్ మెంట్ కు కలర్స్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఈ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి.. ఈ కంటెట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయంటూ తనదైన శైలిలో పంచ్ లు వేశారు. "ఆకలితో వేటాడే పులి చూసుంటారు.. ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు.. ఆదిపత్యం కోసం వేటాడేపులిని చూసుంటారు.. కానీ ఆశయం కోసం వేటాడే పులే ఈ పులివెందుల బిడ్డ జగన్" అని రోజా అన్నారు.

    ఇది చదవండి: వైసీపీకి విజయమ్మ  రాజీనామా.. ప్లీనరీలో సంచలన ప్రకటన


    దేశంలో ఏ పార్టీ సాధ్యం కాని రికార్డులను వైసీపీ తిరగరాస్తోందన్నారు. ఇందుకు ఒక కారణం లీడర్ అయితే.. మరో కారణం క్యాడర్ అంటూ డైలాగులు పేల్చారు. పార్టీ స్థాపించిన 12ఏళ్లలో 9ఏళ్లు పోరాటం చేయడంలో రికార్డు సృష్టించామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పేదల కోసం కృషి చేస్తూ రికార్డు క్రియేట్ చేశారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాలర్ ఎగరేసి జనంలోకి వెళ్తున్నామంటే అందుకు కారణం జగన్ అన్నారు.

    ఇది చదవండి: రాష్ట్రంలో రాక్షసులు బయలుదేరారు..! ప్లీనరీలో జగన్ సంచలన కామెంట్స్..


    అధికారంలోకి రాకముందు జగన్ కు బంగారు రాఖీ కట్టి సీఎం కావాలని కోరుకుంటే.. అనుకున్న విధంగానే ఆయన ముఖ్యమంత్రి అయి.. మహిళలకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నారన్నారు. అంతేకాదు సీఎం జగన్-భారతి రెడ్డిల గారాల పట్టి వర్షిణి రెడ్డి మాస్టర్స్ డిగ్రీ పొందడంపై రోజా అభినందలు తెలిపారు రోజా. తన బిడ్డలు ఎంత గొప్పగా చదువుకొని గౌరవం పొందాలని సీఎం కోరుకుంటారో.. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా అదేస్థాయికి వెళ్లాలని కోరుకుంటారని రోజా అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడవడమే కాకుండా.. వారి కష్టాలను కూడా గట్టెక్కిస్తున్నారన్నారు. పాదయాత్రలో ముల్లు గుచ్చుకున్నా.. ఒంట్లో కత్తిదిగినా బెదరకుండా ముందుకెళ్లారని రోజా అన్నారు. అమ్మను మించిన దైవం లేదు.. కానీ అన్నన మించిన ధైర్యం లేదన్నారామె. జగనన్ వన్స్ మోర్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Minister Roja, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు