ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళాభివృద్ధి కోసం కోసం సీఎం జగన్ (CM YS Jagan) అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy RamaChandra Reddy తెలిపారు. గురువారం శాసనసభలో (AP Assembly) సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారికి మాత్రమే లబ్దిచేకూర్చేలా ఉండటాన్ని సీఎం జగన్ తన సుదీర్ఘమైన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసి చలించిపోయారన్నారు. అదే సమయంలో వివిధ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వయస్సు మధ్యనున్న లక్షలాది మహిళలు పడుతున్న కష్టాలను, కుటుంబ బరువు బాధ్యతలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత వారికి ఆర్ధిక చేయూత కల్పించేందుకు పథకాలను రూపొందించినట్లు వివరించారు. ముఖ్యంగా వైయస్ఆర్ చేయూత పథకాన్ని పార్టీ మేనిఫెస్టోలోని ప్రధానమైన నవరత్నాలలో చేర్చినట్లు పేర్కొన్నారు.
వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా కుటుంబంలోని మహిళను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దిరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు 4 దఫాలుగా నాలుగేళ్ళలో మొత్తం రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ మొత్తాలతో మహిళలు తమ కుటుంబంలో జీవనోపాధి అవకాశాలు మెరుగుపరుచుకుని, ఆదాయ ఉత్పత్తితో సంపదను సృష్టించుకునేలా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు రెండు విడతల్లో సుమారు 25 లక్షల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మొత్తం రూ.9,179.67కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. మొదటి విడత కింద 4500.21 కోట్లు, రెండో విడత కింద 4679.46 కోట్లు అందించామని వెల్లడించారు.
కేవలం మహిళలకు ఆర్థిక చేయూతను అందించడంతోనే సరిపెట్టుకోకుండా మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసేందుకు, వారి జీవనోపాధి మెరుగు పర్చుకొనే విధంగా, మొదటి ఏడాది అమూల్, హిందూస్తాన్ యూని లివర్, ఐ.టి.సి., ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. . అలాగే రెండో ఏడాది అజియో –రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర & ఖేతి, గ్యాన్, నైన్, ప్రోక్టర్&గ్యంబిల్ (సానిటరీ నాప్కిన్స్) వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళలకు సుస్థిరమైన అర్థిక అభివృద్ధికి బాటలు వేశామని వివరించారు.
చేయూత-ఆసరా పథకాల ద్వారా ఈ రెండేళ్ళలో జీవనోపాధి మార్గాలను కల్పించినట్లు మంత్రి తెలిపారు. 81, 503 కిరాణా దుకాణాలు, 2,202 దుస్తుల వ్యాపారం, 3,18,385 పాడిగేదలు,గొర్రెలు, మేకలు పెంపకం, 8,499 పెరటి కోళ్ల పెంపకం, 16915 మందికి వ్యవసాయేతర జీవనోపాధి, 19966 మందికి వ్యవసాయ జీవనోపాధి, సెర్ప్ సహకారం తో 60,066 ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కలిపి 5,17,536 మందికి లబ్ధి చేకూర్చినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.