GT Hemanth Kumar, Tirupathi, News18
Minister Peddireddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) అయితే 175కి 175 సీట్లు నెగ్గడమే టార్గెట్ గా పెట్టుంది. అంటే అందులో ప్రధాన అజెండా కుప్పంలో నెగ్గడమే.. మరి అది సాధ్యమేనా..? తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం.. గెలుపై ధీమాగా ఉన్నారు.. మొన్న కుప్పం (Kuppam) పర్యటన తరువాత ఆయనలో మరింత జోష్ పెరిగింది. కేవలం కుప్పంలో నెగ్గవమే కాదు..? చిత్తూరు జిల్లాలో అత్యధిక సీట్లు నెగ్గడంపై ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) ని కూడా ఓడిస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ సారి పెద్దిరెడ్డికి షాక్ తప్పదని కాన్ఫిడెన్స్ గా కామెంట్ చేశారు. పీలేరు సబ్ జైల్ లో ఉన్న టిడిపి కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓటమి పాలు చేస్తానంటూ సవాల్ విసిరారు..
తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి పెద్ది రెడ్డి.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాను అన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చి పదేపదే తన గురించి మాట్లాడుతున్నారని, తాము ప్రజల కోసం పని చేస్తున్నాం మని, చంద్రబాబు లాగా సొంత మనుషుల కోసం కాదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు తనపై కారుకూతలు కూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తాం అన్నారు. తమ పక్షాన ప్రజలు ఉన్నంత కాలం మా పని అయిపోదన్నారు.. జిల్లాలో మాపై పైచేయి సాధించడం బాబు తరం కాదన్నారు. తనకు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయి అన్నారు.
ఇదీ చదవండి : తింటే చేదుగా ఉంటుంది..? కానీ ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
ఇప్పటికైనా చంద్రబాబు తన మానసిక పరిస్థితి ఎలా వుందో ఒకసారి వైద్యులను కలిసి చూపిస్తే మంచిదని సూచించారు.. కుప్పంలో తన పరిస్థితి ఎంటో తాను చూస్తానని చెప్పిన మంత్రి, చంద్రబాబు పుంగనూరులో చేసేది ఏముందన్నారు.. కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు జెండాను శాశ్వతం పీకేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. తనకు చేతకాక.. పవన్ కు టీడీపీ జెండా అప్పగించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కుడా కష్టమే అని అభిప్రాయపడ్డారు. తాను కుప్పంలో పోటీ చేసి నెగ్గడానికి సిద్ధంగా ఉన్నానని.. మరి చంద్రబాబు పుంగనూరులో తనపై పోటికి సిద్దామా అంటూ ప్రశ్నించారు. రెండు చోట్లా పోటికి తాను సై అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Peddireddy Ramachandra Reddy