Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER KODALI NANI SLAMS NARA CHANDRA BABU NAIDU AND NARA LOKESH ON LIQUOR ISSUE FULL DETAILS HERE PRN GNT

Kodali Nani: లోకేష్‌ది క్వార్టర్‌ నాలెడ్జ్‌... బాడీతో పాటు బ్రెయిన్‌ కూడా తగ్గినట్లు ఉంది… కొడాలి నాని కౌంటర్స్

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

మద్యం పాలసీపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ (YSRCP) నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ (TDP) మాత్రం లిక్కర్ బాటిల్స్ టెస్ట్ చేయిద్దామంటూ ప్రతి సవాల్ విసురుతోంది.

ఇంకా చదవండి ...
    మద్యం పాలసీపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ (YSRCP) నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ (TDP) మాత్రం లిక్కర్ బాటిల్స్ టెస్ట్ చేయిద్దామంటూ ప్రతి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న మద్యం బ్రాండ్లకు ఎవరు అనుమతులిచ్చారనే దానిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగారు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారని.., ఆ వాస్తవాన్ని అంగీకరించే దమ్మూ, ధైర్యం లేక టీడీపీ ఎమ్మెల్యేలు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. కమీషన్లు తీసుకుని డిస్టలరీలకు చంద్రబాబు అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్లిపోయారని., రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు.

    సారాను బాటిల్‌లో పోసి, దానికి వారుణి- వాహిని అని పేరుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయేనని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తప్పుడు పనులు వారు చేసి, పైపెచ్చు జె బ్రాండ్లు అని, డిస్ట్లరీలను రద్దు చేయాలని చంద్రబాబు చెబితే, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేయడం విచిత్రంగా ఉందన్నారు. తాము రద్దు చేస్తే 24 గంటల్లో మళ్ళీ మీరే కోర్టుకు పంపించి స్టే లు తెచ్చుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు డిస్టలరీలు పెట్టినవాళ్ల దగ్గర నుంచి, కమీషన్లు తీసుకుని, 25 ఏళ్ల పాటు నడుపుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చింది చంద్రబాబేనని.., మేము వాటిని రద్దు చేస్తే వాళ్లంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనే విషయం బాబుకు తెలియదా? అని నాని నిలదీశారు.

    ఇది చదవండి: చంద్రబాబుకు కొత్త నిక్ నేమ్.. జే బ్రాండ్ వైసీపీ ఇచ్చిన అర్ధం ఇదే..!


    ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, లెజెండ్, 999 పవర్ స్టార్, బూమ్‌ బూమ్‌ బీరు... ఇలాంటి బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. వీటిని మా ముఖ్యమంత్రి నిన్న ఆధారాలతో సహా ప్రజల ముందుకు తెస్తే... టీడీపీకి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయారన్నారు. మద్యంలోనే పుట్టి మద్యంతోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారి సూచనలు తమకు అవసరం లేదన్న కొడాలి నాని.., టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభ మీద కానీ, ప్రజాస్యామ్యం మీదకానీ నమ్మకం లేదు కాబట్టే సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

    ఇది చదవండి: మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదే.. అసెంబ్లీలో లెక్కలు చెప్పిన మంత్రి..


    రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని పప్పు లోకేష్‌ చెబుతున్నారని మంత్రి అన్నారు. అలా చేస్తే లోకేష్ ఏ జిల్లాలో ఉండాడో చెప్పాలన్నారు. అసలు నీకు నియోజకవర్గమే లేదంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలు మీకు ఇష్టం లేనప్పుడు, కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని చంద్రబాబు లేఖ రాయడం సిగ్గుచేటు కాదా..? అని ప్రశ్నించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kodali Nani, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు