Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER KODALI NANI MADE SENSATIONAL COMMENTS ON TDP AND HIS MINSTER POST FULL DETAILS HERE PRN

Kodali Nani: మంత్రి పదవే నాకు అడ్డు.. లేదంటే టీడీపీకి విశ్వరూపమే! కొడాలి నాని.. భీమ్లా నాయక్ డైలాగ్..

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

టీడీపీ (TDP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పై ఏపీ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) మండిపడ్డారు. బాబు పేరు చెబితే తీవ్ర పదజాలంతో విరుచుకుపడే ఆయన.. మరోసారి అదేరేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు తన మంత్రి పదవి గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇంకా చదవండి ...
    టీడీపీ (TDP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పై ఏపీ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) మండిపడ్డారు. బాబు పేరు చెబితే తీవ్ర పదజాలంతో విరుచుకుపడే ఆయన.. మరోసారి అదేరేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు తన మంత్రి పదవి గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను సీఎం జగన్‌ (AP CM YS Jagan) వద్ద మార్కుల కోసమో, పదవుల కోసం మాట్లాడే వ్యక్తిని కాదని., బతికినంత కాలం జగన్‌గారితోనే ఉంటాననని.., తనకు ఏ మార్కులు అవసరం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవితో కూడా తనకు సంబంధం లేదన్న ఆయన.., మంత్రి పదవి ఉండబట్టే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, బాధ్యతగా ఉండాల్సి వస్తుందన్నారు. అది లేకపోతే నా విశ్వరూపం ఏమిటో టీడీపీ వాళ్ళు చూస్తారని హెచ్చరించారు.

    ఎన్టీఆర్ కు ద్రోహం చేసినందుకు, ఆయన విగ్రహం కాళ్ళు పట్టుకునైనా బాబు క్షమాపణ కోరాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయితే.. ఎందుకు వెన్నుపోటు పొడిచారు, ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పదవి లాక్కుని, ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించి.. నేడు దండలు వేయడానికి సిగ్గు లేదా..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. పునర్నిర్మాణం చేస్తావా బాబూ..!? అంటూ నాని నిలదీశారు. ఎన్టీఆర్ శాపం తగిలే.. చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: ఆ విషయంలో తగ్గేదేలే.. అధికారులకు సీఎం జగన్ టార్గెట్..


    బాబు బొమ్మ పెడితే ఓట్లు రాలటం లేదనే.. మళ్ళీ ఎన్టీఆర్ భజన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్నది ఎవరి పార్టీ - ఆ టీడీపీకి, ఈ టీడీపీకి సంబంధం ఏమిటో బాబు సమాధానం చెప్పాలన్నారు. నాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్‌ చేసి, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఆయన చావుకు కారణం అయిన దుర్మార్గులు చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ అని కొడాలి నాని ఆరోపించారు. వాస్తవానికి, వీళ్లకు ఎన్టీఆర్‌ మీద ఎలాంటి ప్రేమ లేదు. ఆయన పెట్టిన పార్టీ మీద, ఆయన ముఖ్యమంత్రి కుర్చీ పైనే వీరి ప్రేమంతా అని విమర్శించారు.

    ఇది చదవండి: “జగన్ సీఎం కాకుంటే రాజకీయాలకు గుడ్ బై.. మేం గాజులు తొడుక్కోలేదు..”మంత్రి సంచలన వ్యాఖ్యలు..


    చంద్రబాబు వల్లే టీడీపీ నాశనమైందని కొడాలి నాని ధ్వజమెత్తారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి ఏపీలోనూ అదే గతిపట్టించారన్నారు. సాధారణ ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్‌ సీట్లుకు తెచ్చారని.., ఒక రాజ్యసభ సభ్యుడిని గానీ, శాసన మండలి సభ్యుడిని గానీ గెలిపించుకోలేని పరిస్థితికి టీడీపీదన్నారు. స్థానిక అన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితికి టీడీపీని దిగజార్చారన్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబును ఆయన కొడుకుని రాజకీయ సమాధి చేసి పగ, ప్రతీకారం తీర్చుకుంటారని కొడాలి నాని అన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Kodali Nani

    తదుపరి వార్తలు