ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. సీఎం చెప్పిందే ఫైనల్ అనుకుంటే ఎలా...? అని ప్రశ్నించారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా జగన్ నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఎవరితో చర్చించకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు కోసం రాయలసీమలో ఆరు నెలలుగా ఆందోళన జరుగుతోందని... చంద్రబాబు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
టీడీపీ నాయకులు కూడా సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిందే చేస్తాడని అన్నారు. సుజనా చౌదరి ప్రధాని, హోంమంత్రి అనుకుంటున్నాడా ? అని ధ్వజమెత్తారు. సుజనాకు క్రెడిబిలిటీ లేదని... .జైల్లో పెడతారానే భయంతో బీజేపీలోకి వెళ్లిన సుజనా మాటలు పట్టించుకోవద్దని ఎద్దేవా చేశారు. స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకూ రైతులు ఆందోళన చెందవద్దని కొడాలి నాని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kodali Nani, Tdp, Ysrcp