హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: మంత్రి కొడాలి నానిపై పోలీస్ కేసు.. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా..?

Kodali Nani: మంత్రి కొడాలి నానిపై పోలీస్ కేసు.. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా..?

ఇటీవల ఏపీలోని రాజకీయ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, అవంత్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఏపీలోని రాజకీయ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, అవంత్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఏపీలో (Andhra Pradesh) కరోనా వైరస్ వేరియంట్ (Corona Virus) రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం పోలీస్ కేసుల వరకు వెళ్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో వైరస్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే వైరస్ వేరియంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలోని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు మంత్రి సీదిరి అప్పల రాజుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయం వేడెక్కింది. దీంతో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. కొడాలి కామెంట్స్ కు కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వైరస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పంచాయతీ అయిన కందులవారిపల్లె గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సహా వార్డు మెంబర్లంతా కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారా 420 వైరస్ నారావారిపల్లిలో పుట్టిందని అవమానకరంగా మాట్లాడడం బాధకరమన్నారు. చంద్రబాబు నాయుడు గురించి అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నారావారిపల్లిలో 70 ఏళ్ల క్రితం నారా 420 వైరస్ పుట్టిందని గ్రామాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా వైరస్ అంటూ.. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లి గ్రామస్థులను మనోభావాలను దెబ్బ తీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై డిమాండ్ చేశారు.


మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఫిర్యాదు

మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఫిర్యాదు

మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఫిర్యాదు

ఇది చదవండి: ఏపీలో e-Pass పొందాలంటే ఇలా చేయండి.. గంటలో పర్మిషన్ గ్యారెంటీ...


కొడాలి నాని ఏమన్నారంటే..!

కరోనా వైరస్ వేరియంట్ ఎన్-440కే వైరస్ కర్నూలు పుట్టిందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా ఈనెల 8న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టింది. దాని పేరు నారా కరోనా. సీబీఎన్ 420. 70 ఏళ్ళ క్రితమే అక్కడ పుట్టి, రాష్ట్రాన్ని నాశనం చేయటానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి, చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు.. రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది చదవండి: 5 నిముషాల ఆలస్యం.. 11 ప్రాణాలు బలి.. రుయా విషాదానికి బాధ్యులెవరు..?

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Corona virus, Kodali Nani

ఉత్తమ కథలు