హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Gudivada Amarnath: బాబూ నిత్య కళ్యాణ్..పవన్ ట్వీట్ కు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్

Minister Gudivada Amarnath: బాబూ నిత్య కళ్యాణ్..పవన్ ట్వీట్ కు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్

పవన్, అమర్ నాథ్ (ఫైల్ ఫోటో)

పవన్, అమర్ నాథ్ (ఫైల్ ఫోటో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు వైసీపీ మంత్రి అమర్నాథ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆక్సీ మొరాన్ అంటే రెండు విరుద్ధమైన పదాల కలయిక. అయితే ఆక్సీ మొరాన్ కు మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Minister Guduvada Amarnath on Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు వైసీపీ మంత్రి అమర్నాథ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆక్సీ మొరాన్ అంటే రెండు విరుద్ధమైన పదాల కలయిక. అయితే ఆక్సీ మొరాన్ కు మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీతో వివాహం. చంద్రబాబుతో సంసారం. హిందీ అమ్మాయితో పెళ్లి. రష్యన్ తో పిల్లలు. అన్న పరువు బజారు పాలు. బాబూ నిత్య కళ్యాణ్. చారూ జమిందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్ద పెద్ద పేర్లు ఎందుకు గాని ఆ నారా జమిందార్ జీవిత చరిత్ర బాగా చదువుకో అని ట్వీట్ చేశారు.

ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం ట్వీట్ల దాడికి దిగారు. సీఎం జగన్ (Cm jagan), వైసీపీపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.  ఆక్సిమొరాన్ అంటే విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన సీఎం సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని పవన్ చెప్పుకొచ్చారు. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భూమి నుండి ఇసుక వరకు..మధ్యం నుండి గనుల వరకు..అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు ఏపీ నుండి వచ్చే ప్రతీ పైసా కూడా ధనిక సీఎం చేతిలో ఉందన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏపీకి పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చినప్పుడు ఇక దావోస్ ఎవరికి కావాలి. ఇక మన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి న్యూడిల్స్ సెంటర్, ఛాయ్ సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇది వైసీపీ మాస్టర్ క్లాస్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎం చారు మజుంధార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య వంటి క్లాస్ వార్ గురించి మాట్లాడడం చోద్యం అంటూ ట్వీట్ చేశారు.

 

ఈ వ్యాఖ్యలపై మంత్రి అమర్ నాథ్ పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Gudivada, Pawan kalyan

ఉత్తమ కథలు