హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. రిటర్న్ గిఫ్ట్ కు కౌంటర్ గా మంత్రి సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. రిటర్న్ గిఫ్ట్ కు కౌంటర్ గా మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్నీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఫలితం చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార పార్టీ వర్సెస్ రెబల్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) పూర్తిగా వేడెక్కాయి.. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్యేకోట ఎమ్మెల్సీ ఫలితాల (MLA Quota MLC Elections Result) పైనే రచ్చ రచ్చ అవుతోంది. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది.  తాజాగా తనకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) ఘాటుగా స్పందించార. తన ప్రాణానికి హాని ఉంది అన్నారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు త్వరలోనే రిటన్ గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఆమె వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి కౌంటర్ మొదలైంది. ఆమె వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి శ్రీదేవని విమర్శించారు. సినీనటి శ్రీదేవిని మించిన గొప్ప నటి అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఆమెకు ఇప్పుడే ఎందుకు కనిపిచాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు సీఎం జగన్ దగ్గరకు కూతురుని తీసుకెళ్లి ఫొటో దిగిందని... ఆయనను అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు.

శ్రీదేవి వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని చెప్పారు. త్వరలోనే ఆమె అందరూ ఛీకొట్టే స్థితికి చేరుకుంటుందని అన్నారు. దిగ్గజ నటి శ్రీదేవి సినిమాల్లో అద్భుతంగా నటిస్తే.. ఈ శ్రీదేవీ రాజకీయాల్లో అద్భుతంగా నటిస్తోంది అన్నారు. మహానటిని మించిన అవార్డు ఇవ్వొచ్చు అన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన జగన్ గురించి అలా మాట్లాడితే.. పార్టీ ఉపేక్షించదు అన్నారు. ఆమెకు పార్టీ మారాలి అనిపిస్తే.. రాజీనామా చేసి వెళ్లొచ్చని.. లేని పోని ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.

మరోవైపు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ... దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. ఏనాడైనా ఎస్సీలకు చంద్రబాబు పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని అన్నారు. జగన్ ను మోసం చేసిన వాళ్లకు రాజకీయ భవితవ్యం ఉండదని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ ఓటు కోసం టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..? రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారని ఆయన క్లారిటీ ఇచ్చారు. క్రాస్ ఓటింగ్ కు ఎందుకు పాల్పడ్డారో స్వయంగా ఆమెనే చెప్పారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని ఆమెను ఇంతకాలం సీఎం జగన్ ఉపేక్షించారని వెల్లడించారు. నువ్వు అమ్ముడు పోయి ఓటు వేశావని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. శ్రీదేవిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు.

ఇదీ చదవండి : రెబల్ ఎమ్మెల్యే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి..? శ్రీదేవి రాజకీయ అడుగులు ఎటు..?

గతంలో ఆమె అమరావతి రైతుల గురించి ఆమె ఏమీ మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. పార్టీ లైన్ దాటారు కాబట్టే ఆమెను సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. అంతేకాదు చంద్రబాబును పొగిడే ముందు దళితులకు ఆయన ఏమి చేశాడో తెలుసా అని ప్రశ్నించారు. ఆమెను ప్యాకప్ అని అమరావతీ రైతులు అన్నప్పుడు ఇవి గుర్తు లేదా అని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics, Vundavalli sridevi

ఉత్తమ కథలు