హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Dharmana: పవన్ నాతో నడవాలి.. అలా చెప్తే మేమే పథకాలు ఆపేస్తాం..! మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్..

Minister Dharmana: పవన్ నాతో నడవాలి.. అలా చెప్తే మేమే పథకాలు ఆపేస్తాం..! మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్..

మంత్రి ధర్మాన ప్రసాదరావు

మంత్రి ధర్మాన ప్రసాదరావు

జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) గార మండలం లింగాలవలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయనకు గ్రామంలో ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు కనిపించాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) గార మండలం లింగాలవలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయనకు గ్రామంలో ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు కనిపించాయి. పవన్ ఫ్లెక్సీలపై స్థానిక యువకుల ఫోటోలను గమనించిన ఆయన.. పోస్టర్ల మీద ఫోజులిచ్చి ఫోటోలు దిగితే లాభం లేదన్నారు. ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించాలేగానీ పోస్టర్లు చూసికాదన్నారు. సినిమా వేరు, నిజజీవితం వేరన్న ఆయన.. పాలిటిక్స్ లో ఎన్నో ఒడిదుడుకులుంటాయన్నారు. రాజకీయంగా నడుస్తానంటున్న పవన్ కల్యాణ్.. తనతో కలిసి 3 కిలోమీటర్లు కూడా నడవలేరన్నారు. ప్రజా జీవితం అంటే చెప్పినంత సులువు కాదన్నారాయన.


ఇక ప్రభుత్వ హామీలు, అమలు చేస్తున్న పథకాలపైనా ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వస్తే సీఎం జగన్ (AP CM YS Jagan) అమలు చేస్తున్న పథకాలన్నీ నిలిపేస్తానని ఒక్కమాట చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పథకాలు ఆపేయాలంటే చంద్రబాబు రానవసరం లేదని.. ప్రజలు డబ్బులు వద్దంటే ఒక్కరోజులో పథకాలన్ని నిలిపేస్తామని ధర్మాన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఏం చెప్పామో.. వాటన్నింటినీ క్రమంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇప్పటికే చాలా అమలయ్యాయి.. మిగిలిన హామీలు కూడా చేసి చూపిస్తామన్నారు.


ఇది చదవండి: ఒక్క రూపాయి తక్కువైనా ఊరుకునేది లేదు..! అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..


ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదేనన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మూడేళ్లుగా పథకాలు అమలు చేస్తున్నా.. చాలామందికి ఏ పథకానికి ఎంత వస్తున్నది.. ఎలా వస్తున్నది తెలియడం లేదన్నారు. ఇకనైనా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని ధర్మాన స్పష్టం చేశారు.ఇది చదవండి: ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం సహా ఈ ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటితోనే ప్రసాదాలు..


ఆ రోజు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు మాత్రం డ్వాక్రా రుణాల‌కు సంబంధించి ఇచ్చిన మాట త‌ప్పారని.., ఐదేళ్ల పాటూ డ్వాకా రుణ మాఫీ అన్న విష‌యాన్నే మ‌రిచిపోయారని ధర్మాన విమర్శించారు. కానీ తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌థ‌కాల అమ‌లుకు, అభివృద్ధి ప‌నులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అలాగే విద్యా దీవెన ప‌థ‌కం (Jagananna Vidya Deevena) కింద ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నామన్నారు. వీటితో పాటు సామాజిక పింఛన్లను రెండువేల ఐదు వందలకు పెంచామమని.. ఈ విషయాలను కూడా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటే త్వరలోనే పింఛన్లను రూ.2,750కి పెంచుతామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Pawan kalyan, Ysrcp

ఉత్తమ కథలు